EPF లో మొబైల్ నంబర్ ఆన్లైన్లో ఎలా అప్డేట్ చెయ్యాలో తెలుసుకోండి.!
UAN లో మొబైల్ నంబర్ ను ఎలా అప్డేట్ లేదా చేంజ్ ఎలా చేయాలి
మీ EPF రిజిష్టర్ మొబైల్ నంబర్ ను ఆన్లైన్లో చాలా సింపుల్ గా మీరే మీ అప్డేట్ చేసుకోవచ్చు
EPF అకౌంట్ లో ఎలా అప్డేట్ చెయ్యాలో చాలా మందికి తెలియక పోవచ్చు
సాధారణంగా మనం కొత్త మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు లేదా పాత నంబర్ ను మార్చవలసి వచ్చినప్పుడు EPF అకౌంట్ లో ఎలా అప్డేట్ చెయ్యాలో చాలా మందికి తెలియక పోవచ్చు. అందుకే, UAN లో మొబైల్ నంబర్ ను ఎలా అప్డేట్ లేదా చేంజ్ ఎలా చేయాలి అనే విషయాన్ని సవివరంగా చర్చిస్తున్నాను. మీ EPF రిజిష్టర్ మొబైల్ నంబర్ ను ఆన్లైన్లో చాలా సింపుల్ గా మీరే మీ అప్డేట్ చేసుకోవచ్చు. ఎలా అప్డేట్ చెయ్యాలో క్రింద చూడవచ్చు.
UAN లో మొబైల్ నంబర్ ఎలా మార్చాలి?
ముందుగా UAN మెంబర్ e-సేవ పోర్టల్ ఓపెన్ చెయ్యాలి
ఇక్కడ మీ UAN నంబర్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి
లాగిన్ అయిన తరువాత ఇక్కడ మీకు మైన్ పేజ్ కనిపిస్తుంది
మైన్ పేజీలో Manage అనే అప్షన్ కనిపిస్తుంది, దీని పైన నొక్కండి
ఇక్కడ మీరు Contact Details పైన నొక్కండి
ఇక్కడ మీకు మీ రిజిష్టర్ మొబైల్ నంబర్ క్రింద Change Mobile Number అప్షన్ కనిపిస్తుంది
ఇక్కడ Change Mobile Number పక్కన బాక్స్ పైన టిక్ చేయండి
వెంటనే మీకు కొత్త నంబర్ అప్డేట్ లేదా చేంజ్ చేయాల్సిన నంబర్ ఎంటర్ చేసి ఆధరైజ్ చేయండి.