Elon Musk AI కంపెనీ కోసం హిందీ ట్యూటర్స్ కావాలట. ఏది చేసిన హాట్ న్యూస్ గా నిలిచే ఎలాన్ మస్క్ ఇప్పుడు మరొక కొత్త న్యూస్ తో హాట్ టాపిక్ గా మారారు. ప్రొఫెషనల్ గా హిందీ రాయడం మరియు మాట్లాడటం వచ్చి టెక్నాలజీ పైన మక్కువ ఉన్న వారికి ఈ అవకాశం లభిస్తుంది. అయితే, హిందీ తో పాటు ఇంగ్లీష్ కూడా చాలా చక్కగా రాయడం మరియు ఫ్లూయెంట్ గా మాట్లాడటం వచ్చి ఉండాలి.
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా వినిపించే పదం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI). అందుకే, పరిగెడుతున్న కాలంతో AI రేసులో ముందుండాలని అన్ని కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయి. ఇదే దారిలో ఎలాన్ మస్క్ యొక్క xAI ని మరింత పటిష్టం చేయడానికి అనేక భాషల్లో దీనికి ట్రైనింగ్ ఇవ్వడానికి పూనుకున్నారు. దీనికోసం ముందుగా హిందీ భాషను నేర్పడానికి ప్రొఫెషనల్ హిందీ ట్యూటర్స్ కోసం చూస్తున్నట్లు పిలుపునిచ్చింది. అంతేకాదు, ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన ట్యూటర్ లకు గంటకు $65 డాలర్లు (సుమారు రూ. 5400) చెల్లించనున్నట్లు కూడా తెలిపారు.
హిందీ మరియు ఇంగ్లీష్ రాయడం మరియు మాట్లాడటంలో పూర్తి ప్రావిణ్యం లేదా ఎక్స్ పర్ట్ అయితే మీరు ఈ జాబ్ కి అప్లై చేయడానికి అర్హత కలిగిన వారు అవుతారు. అయితే కేవలం భాష రావడంతో మాత్రమే సరిపోదు, xAI యొక్క టెక్నికల్ టీమ్ తో AI ఇకికి ట్రైనింగ్ ఇవ్వడానికి తగిన స్ట్రాంగ్ స్కిల్స్ మరియు డిఫరెంట్ డేటా బేస్ లను నావిగేట్ చేసే నేర్పు కూడా ఉండాలి.
Also Read: Realme GT7 Pro స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Elite తో లాంచ్ చేస్తున్న రియల్ మీ.!
ఈ జాబ్ 6 నెలల కాలానికి 6 నెలల కాలానికి టెంపరరీ, ఫుల్ టైమ్ జాబ్ మరియు రిమోట్ లొకేషన్ బేస్డ్ గా చేయవలసి ఉంటుంది. ఈ వివరాలు అన్ని కూడా LinkedIn లో పోస్ట్ చేసిన జాబ్ పోస్ట్ ద్వారా బయటకు వచ్చాయి. ఈ జాబ్ 9AM నుంచి 5PM టైమింగ్ ఉంటుంది మరియు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉండే 5 వర్కింగ్ డేస్ గా ఉంటుంది.