Election 2024: దేశవ్యాపంగా జరగనున్న ఎన్నికల డేట్స్ ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2024 లోక్ సభ ఎన్నికలు కోసం సన్నాహాలు మొదలైయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19 వ తేదీ నుండి మొదలువుతాయి మరియు చివరి దశ పోలింగ్ జూన్ 1 వ తేదీన ముగుస్తుంది. అంటే, దేశం మొత్తంగా మీద ఎలక్షన్ కోలాహం మొదలవుతుంది. అయితే, మీ ఓటర్ లిస్ట్ లో మీరు ఉందా లేదా లేక మీ ఓటు హక్కును వినియోగించు కోవడానికి నిర్ణయించ బడిన పోలింగ్ బూత్ వంటి వివరాలను తెలుసుకోవడం తప్పని సరి అవుతుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ మరియు 25 లోక్ సభ స్థానాలకు గాను మార్చి 18 తేదీ నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది. పోటీ చేయదలిచిన అభ్యర్థులు మార్చి 25వ తేదీ లోపల ఈ స్థానాలకు నామినేషన్ లు దాఖలు చేయవచ్చు.
ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత మే 13వ తేది రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఓటింగ్ ను నిర్వహిస్తుంది. మే 13న ఎలక్షన్ ముగిస్తుంది మరియు ఎన్నికల కమిషన్ జూన్ 4న ఫలితాలను వెల్లడిస్తుంది. ఈ ప్రక్రియలో ఓటర్లు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వారి ఓటు ఎక్కడ వుంది మరియు లిస్ట్ లో పేరు ఉందా లేదా అనే విషయాలు.
అందుకే, ఆన్లైన్ లోనే ఓటర్ లిస్ట్ లో పేరు చెక్ చేయడం మరియు పోలింగ్ బూత్ వివరాలు వంటి వాటిని ఈజీగా చెక్ చేసుకునే వీలు కల్పించింది.
Also Read: WhatsApp Update: వాట్సప్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.!
ఆన్లైన్ లో ఓటర్ లిస్ట్ లో ఓటర్ల వివరాలను చెక్ చేసుకోవడానికి, ఎన్నికల కమిషన్ యొక్క అధికారిక సైట్ సహాయం చేస్తుంది. దీనికోసం ముందుగా electoralsearch.eci.gov.in అని టైపు చేసి సైట్ లోకి ఎంటర్ అవ్వండి. ఇక్కడ మీరు State ను ఎంచుకోవాలి. కావాలంటే ఇక్కడ మీ భాషను కూడా మార్చుకోవచ్చు. అంటే, మీరు ఈ సైట్ ను తెలుగు భలోకి మార్చుకోవచ్చు.
తరువాత, ఓటర్ పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ లేదా వయసు, బంధువు యొక్క మొదటి పేరు, చివరి పేరు, లింగము ఎంటర్ చెయ్యాలి. తరువాత క్రింద అందించిన బాక్స్ లో అడిగిన వద్ద జిల్లా మరియు అసెంబ్లీ నియోజకవర్గం లను ఎంచుకోవాలి. ఇక చివరిగా క్రింద కనిపించే క్యాప్చా ని ఎంటర్ చేసి ‘Search’ బటన్ పైన నొక్కాలి.
ఓటర్ లకు వారి ఓటర్ కార్డ్ సంభందిత అన్ని సర్వీస్ ల కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందించిన యాప్ Voter Helpline app సహాయం చేస్తుంది. ఈ యాప్ లో చాలా సులుభంగా ఓటర్ యొక్క అన్ని వివరాలను వివరంగా తెలుసుకోవచ్చు.
దీనికోసం, ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుండి Install చేయ్యాలి. ఇన్స్టాల్ చేసిన తరువాత మొబైల్ నెంబర్ తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తరువాత, మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీకు మెయిన్ పేజ్ లో కనిపించే ‘Voter Service’ బాక్స్ పైన నొక్కండి. ఇక్కడ ‘Know Your Polling Station Details; అనే బాక్స్ కనిపిస్తుంది.
దీని పైన నొక్కగానే ఇక్కడ మీ EPIC నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ నెంబర్ ఎంటరు చేసి సబ్మిట్ చెయ్యగానే మీ ఓటు హక్కు వివరాలు పూర్తిగా అందించ బడతాయి.