నకిలీ SIM Card లకు ఈ విధంగా చెక్ పెట్టిన DoT.!

Updated on 20-Dec-2022
HIGHLIGHTS

నకిలీ SIM కార్డ్ లకు పూర్తిగా చెక్

నకిలీ SIM బెడదను నామరూపాలు లేకుండా చెయ్యాలని DoT యోచిస్తోంది.

DoT కొత్త SMS రూల్ ని రూపొందించింది

ఇటీవల DoT తీసుకున్న కొత్త నిర్ణయంతో మార్కెట్ లో ఉన్న నకిలీ SIM కార్డ్ లకు పూర్తిగా చెక్ పెట్టింది. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న SIM Swap మోసాలను రూపుమాపడానికి డిపార్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కొత్త SMS రూల్ ని రూపొందించింది. ఈ కొత్త SMS రూల్ ద్వారా నకిలీ SIM బెడదను నామరూపాలు లేకుండా చెయ్యాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) యోచిస్తోంది.

DoT కొత్త SMS రూల్ ఏమిటి?

టెలికం ఆపరేటర్ కు సిమ్ అప్గ్రేడ్ లేదా నంబర్ మార్చమని రిక్వెస్ట్ వచ్చిన తర్వాత, ఆ విషయాన్ని కస్టమర్ కు ఖచ్చితంగా తెలియచేయాలి. దీనికోసం, కస్టమర్ IVRS కాల్ ద్వారా ఆ రిక్వెస్ట్ ను నిర్ధారించాలి. తద్వారా, ఈ ప్రక్రియ SIM కార్డ్ యొక్క అధీకృత హోల్డర్ లేదా యజమాని ద్వారా వచ్చినదే అని నిర్ధారణ అవుతుంది. ఇకవేళ ఈ ప్రక్రియలో కస్టమర్ ఆ రిక్వెస్ట్ నిర్ధారించక పోయినట్లయితే లేదా తిరస్కరించినట్లయితే, టెలికాం ఆపరేటర్ వెంటనే SIM అప్‌గ్రేడ్ ప్రక్రియను వెంటనే నిలిపివేయవలసి ఉంటుంది. ఇతరులు మీ మొబైల్ నంబర్ మరియు OTPకి యాక్సెస్ పొందకుండా నిరోధించడానికి ఈ కొత్త ప్రక్రియ అనుసంధానం చేయబడింది.

DoT ఈ కొత్త రూల్ ఎందుకు తెచ్చింది?

స్కామర్లు మొబైల్ నంబర్స్ యొక్క డూప్లికేట్ SIM కార్డ్ లను రిక్వెస్ట్ ద్వారా పొందడం కోసం టెలికాం బ్రాండ్‌ లను మోసం చేస్తున్నారు. అంటే, యజమాని ఒకరు దాని డూప్లికేట్ SIM కార్డ్ మరొకరి వద్ద ఉంటుంది. ఇంకేముంది, స్కామర్లు ఈ డూప్లికేట్ SIM కార్డ్‌ని పొందినప్పుడు, ఒరిజినల్ SIM కలిగిన వారి ఖాతాలోని డబ్బును తీసుకోవడానికి లేదా ఇతర మోసపూరిత కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ సిమ్ కార్డు అనధికార యాక్సెస్‌ గా ఉపయోగిస్తారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :