Call Forwarding స్కామర్లకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఈ సర్వీస్ కోడ్ ను తొలగిస్తోంది.!
Call Forwarding స్కామ్ కి చెక్ పెట్టడానికి నడుం బిగించింది ప్రభుత్వం
ఈ స్కామ్ ని అరికట్టడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (DoT) ఈ కొత్త నిర్ణయం
కాల్ ఫార్వార్డ్ ద్వారా చాలా సింపుల్ గా ప్రజలు మోసపోతున్నారు
ప్రస్తుతం దేశంలో ఎక్కువగా జరుగున్న Call Forwarding స్కామ్ కి చెక్ పెట్టడానికి నడుం బిగించింది ప్రభుత్వం. కాల్ ఫార్వార్డ్ ద్వారా చాలా సింపుల్ గా ప్రజలు మోసపోతున్నారు. అందుకే, ఈ మోసాలకు పూర్తిగా కూకటి వేళ్ళతో సహా పెకలించేలా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. దీని పైన చాలా కసరత్తులు చేసిన తరువాత డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (DoT) ఈ కొత్త నిర్ణయం తీసుకునట్లు చెబుతున్నారు.
Call Forwarding స్కామర్ల కోసం DoT కొత్తగా ఏమి చేస్తోంది?
Call Forwarding స్కామర్లను కట్టడి చెయ్యడానికి ఉపయోగించే USSD (అన్ స్ట్రక్చర్డ్ సప్లమెంటరీ సర్వీస్ డేటా) కోడ్ *401# ని కాల్ ఫార్వార్డ్ కోడ్ ను నిలిపి వేస్తుంది. కాల్ ఫార్వార్డ్ చేయడానికి స్కామర్లు ఎక్కువగా ఉపయోగిస్తున్న ఈ కోడ్ ను నిలిపి వేయడం ద్వారా ఈ స్కామ్ లను తగ్గించ వచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (DoT) యోచిస్తోంది.
Also Read: OnePlus Nord CE4: ఈ టాప్ 5 ఫీచర్స్ ఆకట్టుకునే ధరలో వచ్చింది.!
ఎప్పటి నుండి DoT ఈ సర్వీస్ ను నిలిపి వేస్తుంది?
15 ఏప్రిల్ 2024 నుండి USSD ఆధారిత కాల్ ఫార్వార్డింగ్ కోడ్ *401# నిలిపి వేయనున్నది. అంటే, ఈ కోడ్ ద్వారా కాల్ ఫార్వార్డింగ్ చేసే అవకాశం ఇక నుండి మీకు అందుబాటులో ఉండదు. అయితే, ఈ కాల్ ఫార్వార్డింగ్ కోడ్ పైన తదుపరి ఉత్వరులు వచ్చే వరకూ కూడా ఈ సర్వీస్ ను నిలిపి వేయాలని టెలికం కంపెనీలకు పార్ట్మెంట్ ఆఫ్ టెలికం (DoT) ఆదేశాలను అందించింది.
అంటే, ఈ సర్వీస్ కు సంబంధించి మరింకేదైనా ఆల్టర్ నేటివ్ లేదా తగిన సొల్యుషన్ వచ్చే వరకూ ఈ సర్వీస్ ఐ నిలిపి వేస్తుంది కావచ్చని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది మొబైల్ వినియోగదారులు ఈ కాల్ ఫార్వార్డింగ్ కోడ్ దుర్వినియాగం ద్వారా మోసపోయినట్లు కూడా చాలా రిపోర్ట్ లు నమోదు అయినట్లు దృష్టికి కూడా వచ్చాయి.