Disney+ Hotstar AI: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యూజర్ల కోసం కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్ ను తన యాప్ లో జత చేసింది. ఈ కొత్త AI ఫీచర్ తో యాప్ ఉన్న కంటెంట్ వీడియో క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా తక్కువ డేటా ఉపయోగించుకొని స్ట్రీమ్ మరియు డౌన్ లోడ్ చేస్తుంది. అంటే, తక్కువ డేటా ఉపయోగించుకొని ఎక్కువ క్వాలిటీ వీడియో లను అందుకునే అవకాశం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తన యూజర్ల కోసం పరిచయం చేసింది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో AI ఆధారిత వీడియో ఆప్టిమైజేషన్ ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్ తో యూజర్ల డేటా ఎక్కువగా ఖర్చు అవకుండా క్వాలిటీ వీడియో లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తుంది.
గతంలో స్ట్రీమింగ్ లేదా డౌన్లోడ్ కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉపయోగించే డేటా తో పోలిస్తే, ఈ కొత్త ఫీచర్ దాదాపు 25% తక్కువ డేటాను ఉపయోగిస్తుంది. అయితే, వీడియో క్వాలిటీ లో ఏ మాత్రం తేడా ఉండదు, అని కూడా హాట్ స్టార్ తెలిపింది.
కంటెంట్ సీన్స్ ను ఎస్టిమేట్ వేసి ఆ సీన్స్ ను రిఫైన్ చేయడమే కాకుండా AI సహాయంతో ఎన్ హెన్స్ చేస్తుంది. తద్వారా, క్వాలిటీ లో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్ మరియు డౌన్ లోడ్ కోసం తక్కువ డేటా ఉపయోగిస్తుంది.
Also Read: Jio Down: జియో నెట్వర్క్ పనిచేయడం లేదంటూ సోషల్ మీడియాలో యూజర్ల గగ్గోలు.!
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తీసుకు వచ్చిన ఈ కొత్త AI ఫీచర్ తో యూజర్లు ఎక్కువ డేటా ఖర్చు చేయకుండా స్ట్రీమింగ్ మరియు డౌన్ లోడ్ లను ఆనందించవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే తక్కువ డేటా తో ఎక్కువ కంటెంట్ స్ట్రీమ్ లేదా డౌన్ లోడ్ ఎంజాయ్ చేసే అవకాశం అందించింది.