Direct 2 Mobile: ఇక నేరుగా స్మార్ట్ ఫోన్ ల లోనే ఎంటర్టైన్మెంట్ ప్రసారాలు..!

Updated on 19-Jan-2024
HIGHLIGHTS

కొత్త ఇంటర్నెట్ డైరెక్ట్ 2 మొబైల్ సేవలను తీసుకు వచ్చింది

ఎటువంటి నెట్ వర్క్ లేదా ఇంటర్నెట్ అవసరం లేకుండా ఎంటర్టైనమెంట్

ఈ సర్వీస్ ను మొదటిగా తీసుకు వచ్చిన ఘనత కూడా మన దేశానికే దక్కుతుంది

Direct 2 Mobile: నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో కొంచెం సమయం దొరికినా ఎంటర్టైనమెంట్ ను ఆస్వాదిస్తున్నారు. అయితే, దీనికోసం నెట్ వర్క్ పైన ఆదారపడ వలసి ఉంటుంది. అయితే, నెట్ వర్క్ పైన ఇది అధిక వొత్తిడి తీసుకు వస్తుంది. దిన్ని పూర్తిగా అర్ధం చేసుకున్న ప్రభుత్వం ఎటువంటి నెట్ వర్క్ లేదా ఇంటర్నెట్ అవసరం లేకుండా ఎంటర్టైనమెంట్ ను నేరుగా మొబైల్ లలో ఆస్వదించేలా కొత్త ఇంటర్నెట్ డైరెక్ట్ 2 మొబైల్ సేవలను తీసుకు వచ్చింది.

Direct 2 Mobile

ఇది పేరు సూచించినట్లుగా మొబైల్ ఫోన్ లకే డైరెక్ట్ గా ఇంటర్టైన్మెంట్ సేవలను అందిస్తుంది. ఈ సర్వీస్ ను మొదటిగా తీసుకు వచ్చిన ఘనత కూడా మన దేశానికే దక్కుతుంది. ఈ సర్వీస్ గురించి అర్ధమయ్యేలా చెప్పాలంటే, మనం ఇంట్లో ఉపయోగించే డైరెక్ట్ టు హోమ్ సేవల మాదిరిగా పని చేస్తుంది.

అంటే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు? D2H కోసం ప్రత్యేకమైన సెటాప్ బాక్స్ అవసరం అవుతుంది మరి ఇది ఎలా పని చేస్తుంది, అని డౌట్ కలగవచ్చు. అవును, ఇది పని చేయడానికి కూడా ఒక సెటప్ అవసరం అవుతుంది. ఇది జెస్ట్ ఒక చిన్న పరికరాన్ని స్మార్ట్ ఫోన్ కు అటాచ్ చేస్తే సరిపోతుందని ప్రసూతానికి తెలియ వచ్చింది.

Also Read : Amazon Sale 2024 చివరి రోజు iQOO Z7 Pro పైన బిగ్ డీల్స్.!

డైరెక్ట్ టు మొబైల్ ప్రత్యేతలు ఏమిటి?

డైరెక్ట్ టు మొబైల్ గురించి అర్ధమయ్యేలా చెప్పడానికి D2H మాదిరిగా పామి చేస్తుందని చెప్పినా, ఇది చేసే పనులు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే, ఈ కొత్త సర్వీస్ ల కోసం ప్రభుతం కొత్త అడ్వాన్స్డ్ టెక్నలాజిని ఉపయోగించింది. కొత్త తరానికి తగిన ఫలితాల కోసం తీసుకు వచ్చిన డైరెక్ట్ టూ మొబైల్ సర్వీస్ టెక్నాలజీ, యూజర్లు కోరుకునే ఆన్ డిమాండ్ కంటెంట్ మరియు ఇంటరాక్టివ్ సర్వీస్ లకు అనుకూలంగా ఉంటుంది.

ఈ సర్వీస్ లు అందుబాటులోకి వస్తే స్మార్ట్ ఫోన్ యూజర్లకు కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటి? అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఈ టెక్ లేదా సర్వీస్ అందుబాటులోకి వస్తే, యూజర్లు ఎటువంటి డేటా ప్లాన్స్ అవసరం లేకుండా హాయ్ క్వాలిటీలో కంటెంట్ ను చేసే వీలుంటుంది.

దేశంలోని 19 సిటీలలో ఈ డైరెక్ట్ టు మొబైల్ యొక్క పైలెట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే, పూర్తిస్థాయి సేవల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :