2024 జనరల్ ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ అయిన నాటి నుండి ఆన్లైన్ లో Digital Voter Card సింపుల్ గా ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి? అని ప్రజలు ఎక్కువగా వెతుకుతున్నారు. ఎలక్షన్ సమయంలో ఓటర్ ఐడి కార్డ్ లేకున్నా డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్ సహాయంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే వీలుంది. అందుకే, ఈరోజు మనం ఆన్లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డును సింపుల్ గా ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో వివరంగా స్టెప్ బై స్టెప్ తెలియచేస్తున్నాను.
డిజిటల్ ఓటర్ ఐడి కార్డును ఆన్లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవడం సింపుల్ ప్రోసెస్ అనే చెప్పాలి. ఎందుకంటే, దీనికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ తో పాటుగా యాప్ ను అందించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇది అందించిన ఈ సైట్ మరియు యాప్ ద్వారా మీరు సింపుల్ గా డిజిటల్ ఓటర్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఇక ఎలా డౌన్ లోడ్ చేయాలనే ప్రోసెస్ వివరాల్లోకి వెళితే, ముందుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ https://voters.eci.gov.in/ ను ఓపెన్ చెయ్యాలి. ఈ వైబ్సైట్ ఓపెన్ అయిన తరువాత హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ కుడి వైపు భాగం చివరిలో E-Epic Download అనే ప్రతేకమైన బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ పైన నొక్కడం ద్వారా డౌన్ లోడ్ పేజ్ కు చేరుకోవచ్చు. అయితే, లాగిన్ అవ్వని వారు మాత్రం లాగిన్ పేజ్ కి మల్లించబడతారు.
ఒకవేళ మీకు ఈ వెబ్సైట్ లో ముందుగా ఎప్పుడు లాగిన్ అవ్వకుంటే, మీ మొబైల్ నెంబర్ తో కొత్త అకౌంట్ ద్వారా Sign Up అవ్వవచ్చు. దీనికోసం మీరు మీ మొబైల్ నెంబర్ ను కలిగి ఉంటే సరిపోతుంది. ఇక లాగిన్ చేసిన తరువాత E-Epic Download పైన నొక్కడం ద్వారా . కొత్త పేజ్ కు చేరుకుంటారు.
Also Read: Noise ColorFit Ore లాంగ్ బ్యాటరీ మరియు పెద్ద AMOLED స్క్రీన్ తో వచ్చింది.!
కొత్త పేజ్ కు చేరుకున్నాక ఇక్కడ ఓటర్ ఐడి EPIC నెంబర్ ఎంటర్ చేయమని ఒక బాక్స్ కనిపిస్తుంది. ఇందులో, కావాల్సిన ఓటర్ ఐడి యొక్క EPIC నెంబర్ ను ఎంటర్ చెయ్యాలి మరియు క్రింద బాక్స్ లో రాష్ట్రాన్ని కూడా సెలెక్ట్ చెయ్యాలి. ఇలా చేసిన తరువాత ప్రక్కనే ఉన్న Search బాక్స్ పైన నొక్కండి. ఇక్కడ అడిగిన ఓటర్ ఐడి యొక్క పూర్తి వివరాలు కనిపిస్తాయి. వివరాల క్రింద అడిగిన వద్ద OTP కోసం రిక్వెస్ట్ ను చెయ్యాలి.
ఇలా రిక్వెస్ట్ చేసిన తరువాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP అందుతుంది. మొబైల్ నెంబర్ పైన అందుకున్న OTP ని ఎంటర్ చేసి డోన్ లోడ్ పైన నొక్కగానే, కోరుకున్న డిజిటల్ ఓటర్ ఐడి డౌన్ లోడ్ అవుతుంది. అంతే, చాలా సింపుల్ గా డిజిటల్ ఓటర్ ఐడి ఆన్లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.