మీ ఫోన్ లో ఈ 20 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..ఎందుకంటే.!

Updated on 17-Mar-2023
HIGHLIGHTS

మీ ఫోన్ లో ఈ 20 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

ఈ 20 యాప్స్ డేటాని ఇతరులకు చేరవేసే మాల్వేర్ ను కలిగివున్నట్లు గుర్తించబడ్డాయి

ఈ యాప్స్ యూజర్ల సేఫ్టీ మరియు సెక్యూరిటీ లకు గొడ్డలిపెట్టు వంటివి

మీ ఫోన్ లో ఈ 20 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి. ఎందుకంటే, ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల డేటాని ఇతరులకు చేరవేసే మాల్వేర్ ను ఈ యాప్స్ కలిగివున్నట్లు గుర్తించబడ్డాయి. గతంలో కూడా ఇటువంటి మాల్వేర్ ను కలిగి వున్న కారణంగా గూగుల్ తన ప్లే స్టోర్ నుండి అనేక యాప్స్ ను తొలిగించింది. ఈ యాప్స్ యూజర్ల సేఫ్టీ మరియు సెక్యూరిటీ లకు గొడ్డలిపెట్టు వంటివి కాబట్టి ఈ యాప్స్  మీ ఫోన్ లో ఉంటే తొలగించడం మంచిది.               

ఇటీవల, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల నుండి డేటాను దొంగిలించే 203 హానికరమైన యాప్స్ ను థాయిలాండ్ యొక్క డిజిటల్ ఎకానమీ మరియు సొసైటీ మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించాయి. వీటిలో ఒక 20 యాప్స్ లిస్ట్ ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాను.

1. 4K Wallpapers Auto Charger

2. Advanced SMS

3. Art Filters

4. Auto Sticker Maker Studio

5. Baby Sticker – Track Milestones

6. Bass Booster Volume Power Amp

7. Battery Charging Animations Battery Wallpaper

8. Battery Charging Animations Bubble – Effects

9. Beat.ly Music Video Maker

10. Beat maker Pro

11. CallMe Phone Themes

12. Camera Translator

13. Dazz Cam- D3D Photo Effect

14. Guitar Play – Games & Songs

15. Highlight Story Cover Maker!

16. Jigsaw Puzzle

17. Nebula: Horoscope & Astrology

18. ScanGuru
   
19. Equalizer + HD Music Player

20.Loop Maker Pro 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :