ఒక సంవత్సరం పాటు ఫ్రీ ఇంటర్నెట్ ఆఫర్ తో టాబ్లెట్ లాంచ్
By
Souvik Das |
Updated on 02-Jul-2015
HIGHLIGHTS
ఈ డ్యూయల్ సిమ్ కెనడియన్ టాబ్లెట్ 4,999 రూ లకు వస్తుంది.
Datawind కంపెని, Ubislate 7C +x పేరుతో ఇండియాలో 4,999 రూ లకు బడ్జెట్ టాబ్లెట్ ను లాంచ్ చేసింది. ఇది Naaptol షాపింగ్ సైటు నుండి సేల్ అవుతుంది. మరిన్ని షాపింగ్ సైట్లలో మరో వారం రోజులలో లభ్యం కానుంది.
Reliance తో కలిసి ఈ టాబ్లెట్ సంవత్సరం పాటు 2G ఇంటర్నెట్ ను ఇవనుంది. అయితే ఈ ఇంటర్నెట్ ను వాడేందుకు డేటా విండ్ పేటెంట్ ubisurfer ను వాడాలి. ఫేస్బుక్ మరియు ఇ మెయిల్ ను వాడేందుకు సెపరేట్ గా ఫ్రీ యాప్ కూడా ఉంది. ఈ ubisurfer నుండి ఏ వెబ్ సైటు ను అయినా ఏక్సిస్ చేయగలరు.అయితే బ్రౌజింగ్ అదీ కేవలం ubisurfer నుండి మాత్రమే చేయాలి. వేరేగా చేస్తే ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి.
కేవలం ఈ టాబ్లెట్ కే కాకుండా అన్ని డేటా విండ్ డివైజ్ లకు ఫ్రీ ఇంటర్నెట్ ను ఇస్తుంది కంపెని.
ఈ టాబ్లెట్ స్పెసిఫికేషన్స్ –
- డ్యూయల్ సిమ్
- ఆండ్రాయిడ్ OS
- డ్యూయల్ కోర్ ప్రొసెసర్
- వాయిస్ కాలింగ్
- 4GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB అదనపు స్టోరేజ్
- మైక్రో USB కీ బోర్డ్ కనెక్టివిటి
ఆధారం: Gizbot