ఆశాజనకంగా బంగారం మార్కెట్ .. ఈరోజు రేటు ఎంతంటే.!

Updated on 28-Jul-2022
HIGHLIGHTS

జూలై నెల మొత్తం బంగారం కోనాలనుకునే వారికి ఆశాజనకంగా వుంది

ఇప్పటికి కూడా బంగారం 3 నెలల కనిష్ఠ ధరలోనే కొనసాగుతోంది

కొనుగోళ్లు పెరగక పోవడం కూడా బంగారం ధర పెరగక పోవడానికి కారణంగా కూడా చెప్పవచ్చు

జూలై నెల మొత్తంగా బంగారం కోనాలనుకునే వారికి ఆశాజనకంగా వుంది. ఇప్పటికి కూడా బంగారం 3 నెలల కనిష్ఠ ధరలోనే కొనసాగుతోంది. అయితే, ఈ నెల ప్రారంభం నుండి బంగారం ధర కొనుగోలుదారులకు ఆశాజనకంగా ఉన్నా కూడా బంగారం కొనుగోళ్లు మాత్రం పెరగక పోవడం కూడా బంగారం ధర పెరగక పోవడానికి కారణంగా కూడా చెప్పవచ్చు. గత వారంలో బంగారం 7 నెలల కనిష్ఠానికి కూడా చేరుకుంది. అయితే, ఇప్పుడు మళ్ళి మెల్లగా పైకి లేస్తున్న బంగారం సూచీలు. అయినా కూడా బంగారం ధర ఇప్పటికి కొనుగోలుదారులను ఆకర్షించే విధంగానే వుంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా వున్నదో చూద్దామా.         

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,450 రూపాయలుగా ఉండగా, ఈరోజు 350 రూపాయలు పెరిగి 46,800 రూపాయల వద్ద నిలిచింది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 380 రూపాయలు పెరిగి రూ.51,060 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,060 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,060 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,060 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే జైపూర్ లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,220 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :