Gold Rate: ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ తెలుసుకోండి.!

Updated on 16-Aug-2022
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది

ఇప్పటికీ గోల్డ్ రేట్ గత నెలతో పోలిస్తే చాలా ఎక్కువగానే వుంది

ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ తెలుసుకోండి

ఈ వారం ప్రారంభమవుతూనే ఈరోజు మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అయినా కూడా ఇప్పటికీ గోల్డ్ రేట్ గత నెలతో పోలిస్తే చాలా ఎక్కువగానే వుంది. గత  వారం మొత్తం పెరిగిన బంగారం ధర ఈవారం తొలిరోజు కొంత ఊరట నిచ్చింది. గత వారం మార్కెట్లో బంగారం ధర మొత్తంగా 800 రూపాయలకు పైగా పెరిగితే, ఈరోజు మార్కెట్లో బంగారం 150 రూపాయల వరకు తగ్గింది. ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ మార్కెట్ వివరాల కోసం ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ తెలుసుకోండి.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,150 రూపాయలుగా ఉండగా, ఈరోజు 160 రూపాయలు తగ్గి 48,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 170 రూపాయలు తగ్గి రూ.52,360 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,360 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,990 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,180 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here1    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :