Ola మరియు Uber cab సర్వీసెస్ ను passangers నుండి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన charges కన్నా ఎక్కువ తీసుకోవద్దు అని డిల్లీ హై కోర్టు లేటెస్ట్ గా తీర్పు ఇచ్చింది.
ఇందుకు 10 రోజులు time ఇచ్చింది. ఆ తరువాత నుండి 2013 transport కు సంబందించిన పాలసీ ప్రకారం నార్మల్ charges తీసుకోవాలి. అంటే ఆగస్ట్ 22 నుండి ఇది అమలు.
అయితే ఇంతకీ గవర్నమెంట్ రేట్స్ ఏంటి?
Non AC cabs – 12.5 rs per KM.
AC Cabs – 16 rs per KM
11PM నుండి 5AM మధ్యలో అయితే actual fare లో 25% ఎక్కువ ఉంటుంది charge.
ఓలా ,uber వంటివి కూడా గవర్నమెంట్ కన్నా మరీ ఎక్కువ charges తీసుకోవటం లేదు పైన చెప్పిన లెక్కల ప్రకారం కాని అవి అదనంగా మీ ప్రయాణం కు పట్టే సమయానికి కూడా డబ్బులు తీసుకుంటున్నాయి.
ఇంకా స్పెషల్ టైమింగ్ లో surge అని అంటూ సమంజసం లేని charges తీసుకోవటం జరుగుతుంది. అయితే ఇవన్నీ మెట్రో సిటీస్ లో ఉన్న వారికే బాగా పరిచయం అంతకుమించి డైలీ ఆఫీస్ లకు వెళ్ళే వారికీ.