స్మార్ట్ ఫోన్ పేలడం ఈ మధ్య కాలంలో సర్వ సాధారణంగా మారింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నారు? అనుకోకండి. ఎందుకంటే, నిన్న రాత్రి మరోసారి సేల్ ఫోన్ పేలుడు తో ఒకరు మృత్యువాత పడ్డారు. వాహనం నడుపుతున్న వ్యక్తి జేబులో CMF Phone 1 పేలడంతో యాక్సిడెంట్ జరిగి, ఆ వ్యక్తి మృత్యువాత పడ్డారు. మొబైల్ పేలుడు నేరుగా ఆ వ్యక్తి చావుకు కారణం కాకపోయినా, కానీ ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం మాత్రం ఫోన్ పేలుడు అని చెప్పవచ్చు.
మహారాష్ట్రలో జిల్లా పరిషత్ స్కూల్ లో ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న సురేష్ సంగ్రామే అనే వ్యక్తి ఫ్యామిలీ ఫంక్షన్ కోసం నాథు గైక్వాడ్ అనే 56 సంవత్సరాల మరో వ్యక్తి తో బైక్ పై ప్రయాణిస్తుండగా జేబులో ఫోన్ పేలింది. నెల రోజుల క్రితం తీసుకున్న కొత్త సి ఎంఎఫ్ 1 ఫోన్ పేలడంతో బైక్ కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ జరిగింది. ఆ ఘటనలో వెనుక ఉన్న గైక్వాడ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
అయితే, ఫోన్ ఓనర్ సంగ్రామే మాత్రం ఘటనలో శరీరం కాలడంతో పాటు తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో ఫోన్ బ్లాస్ట్ కావడానికి దారి తీసిన కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు విచారణ చెప్పారు. అయితే, కొత్త ఫోన్ లలో ఇటివంటి సంఘటన జరగడం చాలా అరుదుగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మొబైల్ నిపుణుల ప్రకారం, బ్యాటరీలోని మాల్ ఫంక్షన్ కారణంగా ఇటివంటి ఘటనకు దారి తీసి ఉండవచ్చు మరియు ఇటివంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి అని చెబుతున్నారు. సరైన ఛార్జర్ వాడకం పోవడం, అధిక వేడిమికి చేరువలో ఫోన్ ను ఉంచడం మరియు మరిన్ని ఇతర కారణాలు ఫోన్ బ్యాటరీని ప్రభావితం చేస్తాయి. అటువంటి సమయాల్లో ఫోన్ పేలుడుకు దారి తీసే అవకాశం వ్ ఉండవచ్చని చెబుతున్నారు.
Also Read: Redmi Note 13 Pro Plus భారీ తగ్గింపు అందుకుంది: కొత్త ప్రైస్ తెలుసుకోండి.!
ఏది ఏమైనా ఒక మొబైల్ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అందుకే, మొబైల్ ఫోన్ ను ఉపయోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.