ఈ 20 కేటగిరిలో ఉద్యోగాలను సఫా చేస్తానంటున్న ChatGPT4..!
ఈ 20 కేటగిరిలో ఉద్యోగాలను సఫా చేస్తానంటున్న ChatGPT4
ChatGPT యొక్క లేటెస్ట్ వెర్షన్ ChatGPT4 ను తీసుకువచ్చింది
ఇది చాలా కేటగిరీలలో ఉద్యోగాలను భర్తీ చేయవచ్చని చెబుతోంది
ఈ 20 కేటగిరిలో ఉద్యోగాలను సఫా చేస్తానంటున్న ChatGPT4. OpenAI యొక్క ఇంటెలిజెన్స్ ఇంటరాక్టివ్ టూల్ ChatGPT యొక్క లేటెస్ట్ వెర్షన్ ChatGPT4 ను తీసుకువచ్చింది. చాట్ జీపీటీ యొక్క ఈ కొత్త వెర్షన్ వస్తూనే మళ్ళీ కలకలం రేపింది. ఈ కొత్త వెర్షన్ ChatGPT4 మరింత ఖచ్చితత్వం తో ఉంటుందని, ఇది చాలా కేటగిరీలలో ఉద్యోగాలను భర్తీ చేయవచ్చని చెబుతోంది. అంతేకాదు, ఈ విషయం నెట్టింట్లో పెద్ద రచ్చే జరుగుతోంది.మరి ఈ కొత్త చాట్ జీపీటీ4 తో ఎఫెక్ట్ అవనున్న చెబుతున్న ఆ 20 కొలువులు ఏమిటో తెలుసుకుందామా.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ChatGPT గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఈ AI ప్లాట్ఫామ్ చెయ్యలేని పనిలేదని ఇది చాలా మంది ఉద్యోగాలకు రీప్లేస్ కావచ్చని కూడా చెబుతున్నారు. అందుకే, దీని పైన వ్యాపార దిగ్గజాలు ఏమనుకుంటున్నాయో తెలుసుకునేందుకు resumebuilder.com ఒక సర్వే నిర్వహించగా అందులో మెజారిటీ ChatGPT కి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ChatGPT4 రీప్లేస్ చెయ్యగలిగిన జాబ్స్ ఏవని ChatGPT అడిగితే, అది వెంటనే 20 జాబ్స్ లిస్ట్ ను అందించింది. ఈ లిస్ట్ ను క్రింద చూడవచ్చు మరియు ఇదే విషయాన్ని ప్రముఖ మెషిన్ లెర్కింగ్ ఇంజనీర్ Rowan Cheung ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
20 జాబ్స్ లిస్ట్
1 Customer service representative
2 Content writer
3 Translator
4 Data entry clerk
5 Social media manager
6 Virtual assistant
7 Technical support specialist
8 Copy editor
9 Personal assistant
10 peechwriter
11 Blogger
12 Research analyst
13 Proofreader
14 Creative writer
15 Travel agent
16 Sales associate
17 Legal researcher
18 Human resources specialist
19 Marketing analyst
20 Call center representative