అందరికీ అందుబాటులోకి వచ్చిన Chat GPT ఇమేజ్ జెనరేషన్ ఫీచర్: Ghibli-style ఇమేజ్ ఇలా క్రియేట్ చేసుకోండి.!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందించిన అద్భుతాలలో Ghibli-style పోర్ట్రైట్ కూడా ఒకటి. ఈ ఫీచర్ వచ్చిన దగ్గరి నుంచి సోషల్ మీడియా మొత్తం ఈ ఘిబిలి స్టైల్ ఫోటోలతో నిండి పోయింది. ప్రతి ఒకరు కూడా ఈ ఫోటోలు ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుని, నేర్చుకొని మరి ఈ ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు ఇందంతా చేస్తున్నారు? అని మాత్రం డౌట్ పడకండి. ఎందుకంటే, ఇదంతా ట్రెండ్ మహత్యం అని అందరికీ తెలిసిన విషయమే. ఈ ట్రెండ్ ఎంతగా పాపులర్ అయ్యిందంటే, కేవలం ఒక గంట వ్యవధిలోనే Chat GPT ప్లాట్ ఫామ్ పై 10 లక్షల అకౌంట్స్ ఓపెన్ చేసేంతగా. అంతేకాదు, కేవలం ప్రీమియం మెంబర్స్ కి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు అందరికి ఉచితంగా అందుబాటులో వచ్చింది.
Chat GPT ఇమేజ్ జెనరేషన్ ఫీచర్
Open AI యాజమాన్యం లోని చాట్ జిపిటి లో ఇప్పుడు ఇమేజ్ జెనరేషన్ ఫీచర్ కొత్తగా వచ్చి చేరింది. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత ఇందులో కార్టూన్ సినిమాలు మరియు సీరియల్ లో కనిపించే యానిమేటెడ్ ఇమేజ్ లను పోలిన ఇమేజ్ లను క్రియేట్ చేయడం సులభం అందించింది. ఈ ఫీచర్ ఇప్పుడు ఫేమస్ జపనీస్ యానిమేషన్ స్టూడియో, స్టూడియో ఘిబిలి వంటి ఇమేజ్ లను సునాయాసంగా క్రియేట్ చేస్తోంది. అందుకే, ఇప్పుడు చాట్ జిపిటి ముందెన్నడూ లేనంత మరింత ఎక్కువ ప్రాచుర్యం పొందింది.
Also Read: iQOO Z10x 5G: భారీ 6500 mAh బ్యాటరీ మరియు లేటెస్ట్ ఫాస్ట్ 5G చిప్ సెట్ తో వస్తోంది.!
Ghibli-style ఇమేజ్ లను ఎలా క్రియేట్ చేయాలి?
దీనికోసం ఎక్కువ శ్రమ పడవలసిన పని లేదు. ముందుగా, మీ ఫోన్ లో Chat GPT లేటెస్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. తర్వాత, మీ మెయిల్ అడ్రస్ తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత చాట్ బాక్స్ లో లింక్ సింబల్ పై క్లిక్ చేసి మీరు ఘిబిలి ఇమేజ్ గా మార్చాలని కోరుకునే ఇమేజ్ ను అప్ లోడ్ చేయండి. చాట్ బాక్స్ లో ఈ ఫోటో ప్రత్యేక్షం అవుతుంది. తర్వాత “Create this image like Ghibli style portrait” ని లేదా “Convert this image to Ghibli style portrait” టైప్ చేసి సెండ్ చేయండి. అంతే వెంటనే మీరు కోరుకున్న ఇమేజ్ ఘిబిలి స్టైల్ ఇమేజ్ గా మారిపోతుంది.