Chandrayaan-3: చందమామ పైన రెపరెపలాడిన భారత్ జెండా.!

Updated on 25-Aug-2023
HIGHLIGHTS

చందమామ పైన రెపరెపలాడిన భారత్ జెండా

డార్క్ మూన్ ఏరియాలో Chandrayaan-3 దిగ్విజయంగా ల్యాండ్ అయ్యింది

మరోక కొత్త రికార్డ్ ను భారత్ ఇప్పుడు సొంతం చేసుకుంది

Chandrayaan-3: చందమామ పైన రెపరెపలాడిన భారత్ జెండా. భారతదేశ చరిత్రలో ఈరోజు మరొక మరుపురాని రోజుగా వెలిగింది. 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తరువాత అన్ని ఆటంకాలను దాటుకొని చంద్రుని పైన డార్క్ ప్లేస్ గా చెప్పబడే డార్క్ మూన్ ఏరియాలో Chandrayaan-3 దిగ్విజయంగా ల్యాండ్ అయ్యింది. చంద్రుని పై కాలుమోపిన 4వ దేశంగా భారత్ చరిత్రకెక్కింది. అయితే, మరోక కొత్త రికార్డ్ ను భారత్ ఇప్పుడు సొంతం చేసుకుంది. ఈ ప్రయాణం ఇంతటితో ఆగలేదు చంద్రయాన్-3 తో భారత్ ప్రతిష్ట మరింత వెలుగుతుంది. 

నిన్న చందమామ పైన కాలుమోపిన తరువాత ల్యాండ్ అయిన చోటు నుండి మొదటి ఫోటోను కూడా పంపింది. డార్క్ సైడ్ ఆఫ్ మూన్ గా చెప్పబడే చంద్రుని దక్షిణ ధ్రువం పైన కాలుపెట్టిన ఘనత భారత్ కి మాత్రమే దక్కింది. అంతేకాదు, దక్షిణ ధ్రువం యొక్క మొదటి ఫోటో పంపిన మొదటి దేశంగా కూడా భారత్ చరిత్రకెక్కింది. 

ఈ ఫోటో ను నిన్న రాత్రి 9 గంటలకు ISRO తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి Tweet చేసింది. ISRO షేర్ చేసిన ఫోటో లో చంద్రయాన్ 3 ల్యాండ్ సైట్ ను చూపించింది. ఇందులో చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన చోటుతో పాటు చంద్రయాన్ 3 యొక్క ఒక కాలు నీడ కూడా కనిపిస్తోంది. ఈ Photo ను మీరు క్రింద చూడవచ్చు.

నిన్న సాయంత్రం చంద్రయాన్ 3 ల్యాండింగ్ సమయంలో యావత్ భారతదేశం అత్యంత ఉత్కంఠతతో LIVE ను వీక్షించింది. ప్రపంచ నలుమూలల నుండి కూడా మన చంద్రయాన్ 3 సక్సెస్ గురించి ప్రశంసలు వెల్లువెత్తాయి.

చంద్రయాన్ 2 తరువాత భారత్ వెనక్కు తగ్గుందని పలు దేశాలు వేసిన అంచనాలకు చంద్రయాన్ 3 సక్సెస్ తో భారత్ జవాబు ఇచ్చింది. అయితే, చంద్రయాన్ 3 సక్సెస్ పైన ఇప్పుడు అవే దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. 

Image Source: ISRO

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :