మరో రికార్డ్ బద్దలుకొట్టిన Chandrayaan-3..కొత్త రికార్డ్ సెట్.!
Chandrayaan-3 అనేక రికార్డ్స్ ను నమోదు చేసింది
ఈ రికార్డ్ ల వెల్లువగా ఇంకా కొనసాగుతూనే వుంది
ఇది ఇప్పటి వరకూ ఆల్ టైం హైఎస్ట్ నెంబర్
ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చంద్రుని పైకి పంపిన Chandrayaan-3 అనేక రికార్డ్స్ ను నమోదు చేసింది. ఇప్పటి వరకూ ఎవరూ చేరుకొని చంద్రుని దక్షిణ ధ్రువం పైన కాలు మోపిన మొదటి దేశంగా భారత్ ని నిలబెట్టింది చంద్రయాన్-3. అయితే, ఈ రికార్డ్ ల వెల్లువగా ఇంకా కొనసాగుతూనే వుంది. Youtube లో ప్రసారమైన చంద్రయాన్-3 లైవ్ ఫీడ్ వ్యూ కౌంట్ ఇప్పుడు నెట్టింట చర్చగా నిలిచింది. ఇది ఇప్పటి వరకూ Youtube లో నమోదైన అత్యంత అధికమైన నెంబర్ గా చెబుతున్నారు.
చంద్రయాన్-3 ల్యాండింగ్ ను ప్రపంచం మొత్తం నేరుగా చూసేందుకు వీలుగా ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) పలు మాధ్యమాల ద్వారా లైవ్ ఫీడ్ మరియు అప్డేట్ లను నేరుగా ప్రారం చేసింది. ఇందులో యూట్యూబ్ మరియు Facebook కూడా ఉన్నాయి. అయితే, చంద్రయాన్-3 లైవ్ ల్యాండింగ్ ఈవెంట్ ను Youtube లో 8 మిలియన్స్ కు పైగా ఒకేసారి లైవ్ లో వీక్షించినట్లు మరియు ఇది ఇప్పటి వరకూ ఆల్ టైం హైఎస్ట్ నెంబర్ అని కూడా నివేదికలు చెబుతున్నాయి.
2022 డిసెంబర్ లో జరిగిన FIFA World Cup Qatar 2022 లో బ్రెజిల్ vs దక్షిణ కొరియా మధ్య జరిగిన హోరా హోరీగా మ్యాచ్ ను 5M కు పైగా లైవ్ ఫీడ్ ను చూడటం అత్యధిక నెంబర్ గా నమోదు అయ్యింది. ఈ లైవ్ ఈవెంట్ ను బ్రెజిల్ యూట్యూబ్ ఛానల్ CazeTV ఈ ఘనతను దక్కించుకుంది.
అయితే, ఇప్పుడు అంతకి రెండింతలు నెంబర్ ను అందుకున్న చంద్రయాన్-3 లైవ్ ఫీడ్ నెంబర్ ఇప్పుడు టాప్ ప్లేస్ లో నిలిచి రికార్డ్ సృష్టించింది. అయితే, దీని గురించి అధికారిక నెంబర్స్ మరియు ప్రకటన ఇంకా బయటకి రావలసి ఉంది. ఇవన్నీ చూస్తుంటే చంద్రయాన్-3 ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అని, హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.