CES 2019 : హార్లే-డేవిడ్సన్ LiveWire ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ప్రారంభించింది, పానాసోనిక్ ఆటోమోటివ్ ఆధారితంగా

Updated on 10-Jan-2019
HIGHLIGHTS

LiveWire గా పిలువబడే, ఈ మోటార్ సైకిళ్ళు smatphone Apps ద్వారా అనేక కనెక్టివిటీ ఎంపికలు కలిగివున్నాయి

ముఖ్యాంశాలు:

1. హార్లే-డేవిడ్సన్ CES వద్ద మొదటి విద్యుత్ ఉత్పత్తి మోటారు సైకిల్ ప్రారంభించింది

2. LiveWire గా పిలువబడే, ఈ మోటార్ సైకిళ్ళు smatphone Apps ద్వారా అనేక కనెక్టివిటీ ఎంపికలు కలిగివున్నాయి

3. కనెక్టివిటీ సర్వీస్ పానాసోనిక్ ఆటోమోటివ్ చేత సాధ్యమయ్యింది

ఈ హార్లే-డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళు వాటి చిరచిరలాడే ఎగ్సాస్ట్ స్పష్టమైన శబ్దంతో  ప్రాచుర్యాన్నిపొందాయి. ఇప్పుడు, CES వద్ద జనవరి 7న  LiveWire గా   పిలవబడే దాని మొదటి విద్యుత్ ఉత్పత్తి మోటార్ సైకిళ్ళను ప్రారంభించింది. ఈ కొత్త మోటార్ సైకిళ్ళు, ఎలక్ట్రానిక్ రైడర్ సూట్స్ మరియు  పానాసోనిక్ ఆటోమోటివ్ ద్వారా రూపొందించబడిన మొబైల్ కనెక్టివిటీ ఎంపికలు కలిగివున్నాయి. హర్లే-డేవిడ్సన్ లైవ్ వైర్, ప్రస్తుతం US లో ముందస్తు ఆదేశాలు కోసం అందుబాటులో ఉంది మరియు దీని ధర $ 29,799 (సుమారు రూపాయలు 21 లక్షల రూపాయలు).వీటి డెలివరీలను, ఈ సంవత్సరం కార్తీకమాసానికల్లా చేసే  జరిగే అవకాశం ఉంది.

OneConnect, ఆటోమొబైల్స్ కోసం పానాసోనిక్ ఆటోమోటివ్ యొక్క కనెక్టివిటీ పరిష్కారం, హార్లే-డేవిడ్సన్ LiveWire యొక్క టెలిమాటిక్స్ నియంత్రణ యూనిట్ (TCU) నుండి అందుబాటులోవుండి రైడర్స్ స్మార్ట్ ఫోన్లలో సమాచారాన్ని ఇస్తుంది. పానసోనిక్ ఆటోమోటివ్ ప్రకారం, OneConnect సర్వీస్ హర్లే-డేవిడ్సన్ ఆప్ మరియు కొత్త హార్లే-డేవిడ్సన్ కనెక్ట్ ఆప్ యొక్క తాజా వెర్షన్ను పూర్తి చేస్తుంది. "బ్యాటరీ ఛార్జ్ స్థితి నుండి, వాహనం ట్రాకింగ్ వరకు, రైడర్స్ వారి వాహనం గురించి ఒక మంచి అవగాహన కలిగివుంటారు మరియు వారు రైడ్ పూర్తిగా ఎంజాయ్ చేయడం పైన దృష్టిసారించవచ్చని ,"  పానాసోనిక్ ఆటోమోటివ్ వద్ద ప్రోడక్ట్ స్టాటజీ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ అయినటువంటి, డేవిడ్ టేలర్ చెప్పారు.

హార్లే-డేవిడ్సన్ యొక్క కనెక్ట్ ఆప్ తో , LiveWire యొక్క వినియోగదారులు బ్యాటరీ ఛార్జ్ స్థితి మరియు మోటార్ సైకిల్ అందుబాటులోవుండే రైడ్ పరిధికాలాన్ని,  మొబైల్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నంతవరకు వారి స్మార్ట్ ఫోన్ల నుండి రిమోట్ లాగా  ఏ సమయంలోనైనా  తనిఖీ చేయవచ్చు. వారు ఈ App ను  ఉపయోగించి సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్లను కూడా కనుగొనవచ్చు. మరోవైపు, హర్లే-డేవిడ్సన్ ఆప్, ఇది GPS -ఎంబుల్ తో మోటార్ సైకిల్  మార్గంలో ఉన్న ఏదైనా కదలిక లేదా గడ్డలను వినియోగదారులకు తెలియజేస్తుంది. ఇది ప్రయాణంలో వినియోగదారులకు  నిశ్చితకు హామీ ఇస్తుంది. హర్లే-డేవిడ్సన్ ఆప్,   త్వరలో రాబోయే మోటార్ సైకిల్ సర్వీసు అవసరాలను కూడా తెలియచేస్తుంది.

ఈ లైవ్ వైర్ యొక్క అభివృద్ధి సమయంలో క్యూబిక్ టెలికాంతో కలిసి పానాసోనిక్ ఆటోమోటివ్ పనిచేసింది. ఈ డబ్లిన్ ఆధారిత సంస్థ, ఈ LiveWire యొక్క TCU లో ఇన్స్టాల్ చేయబడిన eSIM యొక్క జీవితచక్రాన్ని నిర్వహించడానికి అవసరమైన ప్లాట్ఫారం నిర్వహిస్తుంది. హార్లే-డేవిడ్సన్ ప్రకారం, LiveWire 177 కిలోమీటర్ల (110 మైళ్ళ) మొత్తం పరిధిని కలిగి ఉంది మరియు 3.5 సెకన్ల లోపే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల నుండి పొందవచ్చు. అంతర్గత ఛార్జర్ మరియు ఇంటి గోడల పవర్ ఔట్లెట్ ఉపయోగించి, LiveWire పూర్తి సామర్థ్యాన్ని ఒక రాత్రి మొత్తంలో పూర్తి చేయవచ్చు. అయినప్పటికీ, పబ్లిక్ లెవల్ 3 ఫాస్ట్ ఛార్జ్ స్టేషన్ల ద్వారా వేగవంతమైన ఛార్జ్ సాధ్యమవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :