CES 2017 ఈవెంట్ లో Honda ఆటోమొబైల్ కంపెని సెల్ఫ్ balancing మోటార్ సైకిల్ ను ప్రవేశపెట్టింది. దీనికి స్టాండ్ అవసరం ఉండదు. సొంతంగా నిలుచుంటుంది ఎటువంటి స్టాండ్స్ లేకుండా. క్రింద వీడియో చూస్తె బైక్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది.
హోండా రోబోటిక్ డివిజన్ నుండి ప్రిన్సిపుల్స్ తీసుకొని, ఈ సింగిల్ wheel సెల్ఫ్ balancing స్కూటర్ లో ఉపయోగించింది కంపెని. ఈ టెక్నాలజీ పేరు Moto riding assist అని చెబుతుంది కంపెని.
బైక్ పేరు Uni Cub. నిజానికి బైక్ ముందు భాగంలో హెడ్ లైట్ క్రింద సెపరేట్ మోటార్ ఉంది. ఇది బైక్ ఎప్పుడైనా ఒక వైపుకు పడి పోతుంటే, మరో వైపుకు వెయిట్ ను పెట్టి స్కూటర్ ను బాలన్స్ చేస్తుంది.
అంతే కాదు ఇంజిన్ ఆన్ లేనప్పుడు మీరు బైక్ మీద లేకుండా దాని అంతట అదే నడవగలదు. ఇది జనరల్ గా హెవీ బైక్ లను పార్కింగ్ లేదా ఎక్కడికైనా వెళ్ళటానికి షెడ్ నుండి లోపలకు తీసేటప్పుడు useful.
అయితే ఇది ప్రొడక్షన్ లోకి వస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. ఒకవేళ వస్తే కనుక బైకర్స్ కు మంచి టెక్నాలజీ అని చెప్పాలి. పైగా మేజర్ టెక్నాలజీ అంతా బైక్ ముందు భాగంలోనే ఉంది కనుక ఇదే టెక్నాలజీ ను వేరే బైక్స్ కు కూడా వాడుకునే అవకాశాలున్నాయి.