CERT-in Alert: ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-in) ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ అలర్ట్ ను అందించింది. మీడియాటెక్ మరియు క్వాల్కమ్ చిప్ సెట్ లతో పనిచేసే ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు అలర్ట్ అందించింది. ఈ చిప్ సెట్ లతో పని చేసే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లలో హై రిస్క్ వల్నరబిలిటీస్ గుర్తించినట్లు తెలిపింది. ఒక కొత్త బగ్ కారణంగా ఈ విధంగా జరుగుతున్నట్టు కూడా చెబుతున్నారు.
CERT-in ప్రకారం, ఆండ్రాయిడ్ వెర్షన్ 12, 12L, 13 మరియు 14 తో నడిచే స్మార్ట్ ఫోన్ లలో భద్రతా లోపాలు కనుగొనబడ్డాయి. ఈ భద్రతా లోపాలు క్వాల్కమ్ కాంపోనెంట్స్, మీడియాటెక్ కాంపోనెంట్స్, Arm కాంపోనెంట్స్, ఫ్రేమ్ వర్క్, సిస్టం మరియు ఇమేజినేషన్ టెక్నాలజీస్ లలో కనుగొనబడ్డాయి. వీటి పైన తగిన జాగ్రత్తలు వహించక పోయినట్లయితే ఎటాకర్స్ చేతిలో కీలుబొమ్మగా మారే అవకాశం ఉందని CERT-in హెచ్చరిస్తోంది.
ఈ కొత్త బగ్ కారణంగా ఎటాకర్లు ఈ బగ్ కలిగి ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లను చాలా ఈజీగా బే పాస్ చేయగలుగుతారు. అందుకే, ఆండ్రాయిడ్ 12 మొదలుకొని ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం పై పని చేసే స్మార్ట్ ఫోన్ యూజర్లు జాగ్రత్త వహించాలి.
Also Read: BSNL 4G: 15,000 ఏరియాల్లో 4G నెట్ వర్క్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ టెలికాం.!
ఈ బగ్ ప్రమాదం నుండి మీ స్మార్ట్ ఫోన్ ను ఎలా కాపాడుకోవాలి అంటే, ముందుగా మీ ఫోన్ ను అప్డేట్ గా ఉంచుకోవాలి. అంతేకాదు, మీ ఫోన్ లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ తో అప్డేట్ అయ్యి ఉండాలి మరియు లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ తో అప్డేట్ అయ్యి ఉండాలి. ఒకవేళ మీ అప్డేట్ చేయ్యకుంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలి.
ఈ ఫోన్ లో యాప్స్ మరియు OS అప్డేట్స్ కోసం ఆటో అప్డేట్ ఆప్షన్ ఎంచుకోవాలి. దీని ద్వారా మీ ఫోన్ ఎప్పటి కప్పుడు ఆటో అప్డేట్ అవుతుంది మరియు సురక్షితంగా ఉంటుంది. మరి ముఖ్యంగా నమ్మకమైన సోర్స్ ల ద్వారా మాత్రమే ఎల్లప్పుడూ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
మీకు తెలియని వారి నుంచి వచ్చే మేసేలను కళ్ళుమూసుకుని క్లిక్ చేయకూడదు. ఎందుకంటే, ప్రస్తుతం SMS లేదా వాట్సాప్ లో వచ్చే మెసేజిల ద్వారా ఎక్కువ ఎటాక్ జరుగుతున్నాయి. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే ఎటాక్ లేదా బగ్స్ చొరబాటుకు గురైనట్లు అనిపిస్తే, మీ డేటా బ్యాకప్ చేసుకొని వె వెంటనే ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవడం ఉత్తమం.