Android Phone వాడుతున్న వారికి హై సెక్యూరిటీ వార్ణింగ్ ఇష్యు చేసిన కేంద్రం.!
Android Phone యూజర్ల కోసం కేంద్రం హై సెక్యూరిటీ వార్ణింగ్ ఇష్యూ
CERT-In ఈ హై సెక్యూరిటీ వార్ణింగ్ ను ఇష్యూ చేసింది
ఆండ్రాయిడ్ ఫోన్ లలో ఉన్న ఒక లోపం కారణంగా యూజర్ల డేటా చిక్కుల్లో పడే అవకాశం
Android Phone యూజర్లు జత జాగ్రత్తగా ఉండండి, అంటూ కేంద్రం హై సెక్యూరిటీ వార్ణింగ్ ఇష్యూ చేసింది. ఇంత సడన్ గా కేంద్రం ఇటువంటి వార్నింగ్ ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నారా? ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో ఉన్న ఒక లోపం కారణంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్ల డేటా చిక్కుల్లో పడే అవకాశం ఉందని గుర్తించిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఈ హై సెక్యూరిటీ వార్ణింగ్ ను ఇష్యూ చేసింది.
Android Phone యూజర్లకు ఇచ్చిన ఆ వార్ణింగ్ ఏమిటి?
ఆండ్రాయిడ్ ఫ్రేమ్ వర్క్ లో ఉన్న ఒక లోపం కారణంగా మల్టీ పుల్ వల్నరబిలిటీస్ ను డివైజ్ కు ఆపాదిస్తుంది. ఈ లోపాల కారణంగా ఆండ్రాయిడ్ డివైజెస్ ను అటాక్ చేయడానికి అటాకర్స్ కి దారి సుగమం అవుతుంది. అంటే, ఆండ్రాయిడ్ డివైజ్ లో ఉన్న యూజర్ సున్నితమైన డేటా చిక్కు పడే అవకాశం ఉంటుంది.
ఈ ఆండ్రాయిడ్ డివైజెస్ రిస్క్ లో ఉన్నాయి?
లేటెస్ట్ ఆండ్రాయిడ్ OS కలిగిన మిలియన్ల కొద్దీ డివైజెస్ ఇప్పుడు రిస్క్ లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12L, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14 మరియు ఆండ్రాయిడ్ 15 కలిగిన డివైజెస్ ఈ లోపాన్ని కలిగి ఉంటాయి.
ఈ సమస్య నుంచి ఆండ్రాయిడ్ డివైజ్ ను ఎలా కాపాడుకోవాలి?
ఈ సమస్య నుంచి ఆండ్రాయిడ్ డివైజ్ ను ఎలా కాపాడుకోవడానికి లేటెస్ట్ అప్డేట్ తో ఫోన్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యను గుర్తించిన వెంటనే కొత్త అప్డేట్ ను ఆండ్రాయిడ్ అందించింది. అందుకే, కొత్త సెక్యూరిటీ ప్యాచ్ తో ఫోన్ ను అప్డేట్ చేసుకోండి.
Also Read: iQOO Neo 10 Pro లాంచ్ కంటే ముందే రికార్డ్ సృష్టించింది.!
ఆండ్రాయిడ్ ఫోన్ సేఫ్టీ కోసం బెస్ట్ టిప్స్
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను సెక్యూర్ గా ఉంచుకోవడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. క్రెడిబుల్ సోర్స్ లేనటువంటి APKs ను డౌన్లోడ్ లేదా ఇన్స్టాల్ చేసుకోకపోవడం ఉత్తమం. Unknown సోర్స్ ల నుంచి వచ్చే లింక్స్, ఈమెయిల్స్ లేదా మెసేజెస్ పై క్లిక్ చేయ్యకండి.