రేషన్ కార్డ్ లబ్ధిదారులకు కేంద్రం గుడ్ న్యూస్.!

Updated on 20-Jun-2023
HIGHLIGHTS

రేషన్ కార్డ్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అందించిన కేంద్ర ప్రభుత్వం

డెడ్ లైన్ ను పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది

రేషన్ కార్డ్ తో ఆధార్ కార్డు లింక్ చేసుకోవడానికి ఇప్పుడు మరింత సమయాన్ని అందించింది

రేషన్ కార్డ్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అందించిన కేంద్ర ప్రభుత్వం. రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా వారి రేషన్ కార్డ్ ను ఆధార్ కార్డ్ తో  లింక్ చెయ్యాలని సూచించడంతో పాటుగా జూన్ 30 ని డెడ్ లైన్ కూడ ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఈ డెడ్ లైన్ ను పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. రేషన్ కార్డ్ తో ఆధార్ కార్డు ను లింక్ చేసుకోవడానికి ఇప్పుడు మరింత సమయాన్ని అందించింది. 

పేద ప్రజలకు ఉచిత మరియు చవక రేటుకే రేషన్ మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వం అందించే ఈ  రేషన్ కార్డ్ లో ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా అర్హత కలిగిన వారికి మాత్రమే అందించడానికి, నకిలీ రేషన్ కార్డ్ లను నిర్ములించడానికి మరియు ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డ్ కలిగిన వారిని అరికట్టడానికి సరైన విధానంగా కూడా ఈ ఆధార్ లింక్ ఉపయోగపడుతుంది. 

అందుకే ఆధార్ కార్డ్ తో రేషన్ కార్డ్ ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. ఈ ఆధార్ ను రేషన్ కార్డ్ తో లింక్ చెయ్యడం లో పూర్తి సఫలత సాధించడం కోసమే ఈ నెల చివరితో ముగియనున్న ఆఖరి తేదిని మరో రెండు నెలలు పొడిగించి సెప్టెంబర్ 30 ని చివరి తేడాగా ప్రకటించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :