కేంద్రం గుడ్ న్యూస్: Aadhaar Card ఉచిత అప్డేట్ గడువు మళ్ళీ పొడిగించిన కేంద్రం.!

కేంద్రం గుడ్ న్యూస్: Aadhaar Card ఉచిత అప్డేట్ గడువు మళ్ళీ పొడిగించిన కేంద్రం.!
HIGHLIGHTS

ఆధార్ ఉచిత అప్డేట్ గడువును మరో సారి పొడిగిస్తున్నట్లు కేంద్రం అనౌన్స్ చేసింది

ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ ను సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది

ఈ సర్వీస్ కేవలం myAadhaar పోర్ట్ ల నుండి మాత్రమే లభిస్తుందని కూడా తెలిపింది

ఆధార్ ఉచిత అప్డేట్ గడువును మరో సారి పొడిగిస్తున్నట్లు కేంద్రం అనౌన్స్ చేసింది. Aadhaar Card తీసుకొని 10 సంవత్సరాల గడిచిన ఆధార్ హోల్డర్స్ వారి ఆధార్ ను లేటెస్ట్ వివరాలతో అప్డేట్ చేసుకోవడానికి వెసులుబాటుగా ఈ ఉచిత అప్డేట్ అవకాశాన్ని అందించింది. అయితే, ఈ అవకాశం 2024 జూన్ 14వ తేదీ తో ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సౌకర్యం ముగుస్తుందని UIDAI తెలిపింది. ఇప్పుడు ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ ను సెప్టెంబర్ 14 వరకు పొడిగిస్తున్నట్లు UIDAI అధికారిక ప్రకటన చేసింది.

Aadhaar Card Update

ఆధార్ అప్డేట్ ఉచిత సర్వీస్ ను 2024 జూన్ 14 నుండి 2024 సెప్టెంబర్ 14 వ తేదీ వరకు UIDAI పొడిగించింది. UIDAI అధికారిక X అకౌంట్ నుండి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ ను చేసింది. ఈ ట్వీట్ నుండి ఉచిత ఆన్లైన్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ సర్వీస్ సెప్టెంబర్ 14 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా లక్షల మంది ఆధార్ యూజర్లకు లభ్ది చెరుకూరు తుందని తెలిపింది. ఈ సర్వీస్ కేవలం myAadhaar పోర్ట్ ల నుండి మాత్రమే లభిస్తుందని కూడా తెలిపింది. ఈ ట్వీట్ ను ఈ క్రింద చూడవచ్చు.

కొత్త వివరాలతో ఆధార్ ను అప్డేట్ చేయడానికి ఈ సర్వీస్ అందించిన విషయం మరోసారి UIDAI గుర్తు చేసింది. అంతేకాదు, ఆన్లైన్ లో ఆధార్ డాక్యుమెంట్స్ ను చాలా సులభంగా అప్డేట్ చేసే వీలుందని కూడా సూచించింది.

Aadhaar Card Update
Aadhaar Card Update

ఆన్లైన్ లో డాక్యుమెంట్స్ ఎలా అప్డేట్ చేయాలి?

ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్లో కొత్త డాక్యుమెంట్ లను చాలా సులభంగా అప్లోడ్ చేయవచ్చు. దీనికోసం, ముందుగా My Aadhaar Portal ను ఓపెన్ చెయ్యాలి. ఈ పోర్టల్ లో మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి క్రింద సూచించిన క్యాప్చా ని కూడా ఎంటర్ చేసి ‘Log In With OTP’ పైన నొక్కండి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ పై అందుకున్న OTP తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ‘డాక్యుమెంట్ అప్ డేట్’ ట్యాబ్ పైన నొక్కండి. ఇక్కడ మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది మరియు ఇందులో అందించిన వివరాల క్రింద ‘తరువాత’ అని కనిపిస్తుంది, దాని పైన నొక్కండి.

Also Read: Marshall Minor IV: ఇండియాలో కొత్త ఇయర్ బడ్స్ రిలీజ్ చేసిన మార్షల్ బ్రాండ్.!

ఇప్పుడు మీ పేరు మరియు అడ్రస్ వివరాలతో కూడిన పేజీ వస్తుంది. ఇక్కడ చూపించే వివరాలు సరైనవి అయితే, “పై వివరాలు సరైనవని నేను ధృవీకరిస్తున్నాను” పక్కన వచ్చే సర్కిల్ లో క్లిక్ చేసి తర్వాత పైన నొక్కండి. ఇక్కడ వివరాలు సేవ్ అవుతాయి మరియు మీరు ఈ వివరాలు సరైనవి గా సూచించే కొత్త డాక్యుమెంట్ ను అప్ లోడ్ చేసి సేవ్ చేస్తే సరిపోతుంది. మీ వివరాలు మరియు డాక్యుమెంట్లు అప్డేట్ చేయబడతాయి. దీనికోసం ఎటువంటి సర్వీస్ ఫీజును చెల్లించ వలసిన పనికూడా ఉండదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo