Budget 2024: స్మార్ట్ ఫోన్ రేట్లు మరింత తగ్గనున్నాయా.. కొత్త బడ్జెట్ ఏం చెబుతోంది.!
ఈరోజు కొత్త యూనియన్ బడ్జెట్ అనౌన్స్ జరిగింది
నిర్మలా సీతారామన్ దిగ్విజయంగా తన 7వ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు
తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ లను ప్రజలకు అందించడానికి వీలుగా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.
Budget 2024: ఈరోజు కొత్త యూనియన్ బడ్జెట్ అనౌన్స్ జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ 2024 యూనియన్ బడ్జెట్ వివరాలను ప్రకటించారు. ఇందులో, స్మార్ట్ ఫోన్ ప్రియులకు ప్రియమైన కబురు కూడా అందించారు. స్మార్ట్ ఫోన్స్ పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) మరియు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (PCBs) పైన తగ్గింపును ప్రకటించారు. ఈ చర్య ద్వారా స్మార్ట్ ఫోన్ రేట్ లలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది మరియు దేశీయంగా స్మార్ట్ ఫోన్ తయారీ పెరిగే అవకాశం కూడా ఉంది.
Budget 2024
ఈరోజు జరిగిన 2024 యూనియన్ బడ్జెట్ కు ఒక ప్రత్యేకత కూడా వుంది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ దిగ్విజయంగా తన 7వ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వరుసగా 7వ సారి యూనియన్ బడ్జెట్ ను సీతారామన్ ప్రవేశపెట్టడం కూడా ఒక విశేషం.
ఇక ప్రధాన విషయానికి వస్తే, కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దేశీయంగా స్మార్ట్ ఫోన్ తయారీ పెంచడానికి మరియు తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ లను ప్రజలకు అందించడానికి వీలుగా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త బడ్జెట్ ప్రకారం, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) పైన 15% నుండి 20% వరకు తగ్గింపు ప్రకటించారు. గడిచిన 6 సంవత్సరాల లో పెరిగిన దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ మరియు ఎగుమతి దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ కొత్త బడ్జెట్ తో స్మార్ట్ ఫోన్ కస్టమర్లకు ఏమిటి ఉపయోగం?
ఈ కొత్త బడ్జెట్ తో స్మార్ట్ ఫోన్ కస్టమర్లకు మంచి ఉపయోగం చేకూరుతుంది. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) మరియు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (PCBs) సుంకం తగ్గింపు వలన స్మార్ట్ ఫోన్ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే, ఇందులో ప్రైస్ స్లాబ్ ను పాటిస్తే, ప్రీమియం స్మార్ట్ ఫోన్ ధరలలో పెద్దగా మార్పులు ఉండక పోవచ్చు.
Also Read: Jio Plan Revise: రూ. 349 ప్లాన్ ను అధిక వ్యాలిడిటీ తో రివైజ్ చేసిన జియో.!
మరి ఇంకెవరికి లబ్ధి చేకూరుతుంది?
ఈ కొత్త బడ్జెట్ ప్రకటన వలన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు లబ్ధి చేకూరే అవకాశం మెండుగా కన్పిస్తోంది. అందులోనూ, రూ. 15,000 బడ్జెట్ వచ్చే 5జి స్మార్ట్ ఫోన్స్ ధరలలో ఎక్కువ తగ్గింపు లభించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని టెక్ఆర్క్ చీఫ్ అనలిస్ట్, ఫైజల్ కవూసా తెలిపారు.
“బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) మరియు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు (PCBs) సుంకం తగ్గింపు ప్రతిపాదనతో సరసమైన స్మార్ట్ ఫోన్ తయారీ దిశగా కంపెనీలు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. 15% తగ్గింపు అనేది గొప్ప విషయం, అయితే ఇది స్లాబ్ ప్రకారం ఉండవచ్చు. ఇందులో రూ. 15,000 రూపాయల వరకు వుండే స్మార్ట్ ఫోన్ లు అధిక తగ్గింపు అందుకొని సరసమైన ధరకే లభించే విధంగా సహాయపడవచ్చు” అని ఫైజల్ కవూసా తెలిపారు.