BSNL పబ్లిక్ సెక్టార్ టెలికాం కంపెని నిన్న 40,000 Wi-Fi హాట్ స్పాట్ లను ఇండియా అంతటా సెట్ అప్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
ఇది ప్రైవేట్ నెట్వర్క్స్ లాంచ్ చేస్తున్న 4G సర్వీసెస్ కు కౌంటర్ గా BSNL చేస్తున్న ప్రయత్నం. BSNL కు సొంతంగా 4G డేటా సర్వీసెస్ ను స్టార్ట్ చేసే spectrums లేవు.
ప్రస్తుతానికి ఎయిర్టెల్ మాత్రమే దేశ వ్యాప్తంగా 4G అందిస్తుంది. వోడాఫోన్ మరియు రిలయన్స్ 4g సర్విస్ ను స్టార్ట్ చేయనున్నాయి అతి త్వరలోనే.
ఏ వైఫై హాట్ స్పాట్స్ 4G కన్నా వేగంగా ఇంటర్నెట్ స్పీడ్ ను అందించనున్నాయి అని BSNL CMD అనుపమ్ తెలిపారు. ఇప్పటికే 500 హాట్ స్పాట్స్ ను ఇంస్టాల్ చేసినట్లు కూడా చెబుతుంది.
టోటల్ 250 డిఫరెంట్ లోకేషన్స్ లో ఇది అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వివరాలను BSNL జూన్ 2015 లోనే వెల్లడించింది. అయితే వైఫై హాట్ స్పాట్ ప్రైసెస్ డిటేల్స్ ఇంకా తెలపలేదు.