BSNL టారిఫ్ ప్లాన్ అప్గ్రేడ్ , ఇప్పుడు అన్లిమిటెడ్ డేటా …..

BSNL టారిఫ్ ప్లాన్ అప్గ్రేడ్ , ఇప్పుడు అన్లిమిటెడ్ డేటా …..

టెలికాం కంపెనీలు టారిఫ్ ప్లాన్స్  రివైజ్  చేసే పనిలో పడ్డాయి . దీని  వల్ల  వినియోగదారులకు అత్యధిక ప్రయోజనం లభిస్తుంది . తమ టారిఫ్ ప్లాన్ ని  రివైజ్ చేయటం ద్వారా కంపెనీలు ఇంతకు మునుపు కంటే లాభాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో, ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) రూ .399, రూ 499 ప్రత్యేకమైన టారిఫ్ ప్లాన్లను  రివైజ్ చేసింది .ఈ రెండు ప్లాన్స్ ను  కంపెనీ  తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు అందించింది, అప్గ్రేడ్ చేస్తూ , కంపెనీ ఇప్పుడు అపరిమిత వాయిస్ కాల్స్ అందిస్తోంది. అప్గ్రేడ్ తర్వాత    ఈ రెండు ప్లాన్స్  లో ప్రత్యేకమైనది ఏమిటో  చూద్దాం .

రూ .333 సూపర్ టారిఫ్ ఓచర్ – 

ఈ ప్లాన్ 45 రోజులు  వాలిడిటీ తో వస్తుంది . దీనిలో  వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు, అయితే వారు BSNL నెట్వర్క్లో మాత్రమే పొందుతారు . ఇదే  కాకుండా, ఈ ప్లాన్లో ప్రతిరోజూ 3 జిబి 3 జి డేటా ను పొందుతారు . రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత, ప్లాన్  333 డేటా స్పీడ్  80 Kbps కు తగ్గిస్తుంది. ఇంతకు ముందు ఈ ప్లాన్  డేటా ప్రయోజనాలతో మాత్రమే వచ్చింది .

రూ 444 యొక్క సూపర్ టారిఫ్ ఓచర్ –

BSNL చౌకా  ప్లాన్ పేరుతో  ఈ ప్లాన్  ప్రజాదరణ పొందింది. ఈ ప్లాన్ 60 రోజుల  వాలిడిటీ తో వస్తుంది. రివైజ్  తరువాత, కంపెనీ ఈ ప్లాన్ లో BSNL నెట్వర్క్ లో అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తోంది. ఈ ప్లాన్ తో పాటు, వినియోగదారులు 3G స్పీడ్ తో రోజుకు 4 GB డేటాను పొందుతారు. వినియోగదారులు 3G డేటా పరిమితి క్రాస్ తర్వాత 80 Kbps స్పీడ్  పొందుతారు.

448 రూపీస్ టారిఫ్ ప్లాన్ – 

ఈ రెండు ప్లాన్లకు అదనంగా, BSNL రూ 448 ప్లాన్ ను కూడా రివైజ్ చేసింది . ఈ ప్లాన్ 84 రోజులు  వాలిడిటీ తో వస్తుంది .  ఈ ప్లాన్ అపరిమిత రోమింగ్లో కూడా ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తుంది . ఈ ప్లాన్లో, వినియోగదారులు 3G నెట్వర్క్ స్పీడ్ తో రోజుకి 1 GB డేటాను పొందుతారు. దీనితో పాటుగా, వినియోగదారులు ప్రతిరోజు 100 SMS లను పొందుతారు.

బిఎస్ఎన్ఎల్ పోస్ట్పెయిడ్ ప్లాన్-

 బిఎస్ఎన్ఎల్ సోమవారం రూ .399 ను పోస్టుపైడ్  ప్లాన్ ను ప్రారంభించింది. ఈ ప్లాన్ లో , వినియోగదారులు 3 జి నెట్వర్క్ స్పీడ్ తో ఒక నెలకి   30GB డేటా మరియు అపరిమిత వాయిస్ కాల్స్ పొందుతారు. అయితే, ఇతర కంపెనీల  ప్రణాళికల లాగా, ఈ ప్రణాళిక SMS ప్రయోజనాలతో రాదు.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo