జియో ని బీట్ చేయనున్న BSNL ఆఫర్ : రూ . 29 కి 2జీబీ డేటా 7 రోజులకి వాడుకునే వీలుతో అత్యంత చౌకైన ప్లాన్ ని BSNL ప్రకటించింది

Updated on 13-Aug-2018
HIGHLIGHTS

రూ .9 తో ఒకరోజు మరియు రూ .29 లతో 7 రోజులు అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా 2జీబీ ని కూడా పొందే అవకాశం. ఈ ప్లాన్స్ ఆగష్టు 10 నుండి ఆగష్టు 25 అందుబాటులో ఉంటాయి .

రిలయన్స్ జియో ఒక అరుదైన ప్రత్యర్థి నుండి కఠినమైన పోటీని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ అయిన బిఎస్ఎన్ఎల్ 'ఫ్రీడమ్ ప్రీపెయిడ్ ప్లాన్స్' అనే కొత్త ప్లాన్ తో  అత్యంత చవకైన సేవ అందిస్తుంది. భారతదేశ ఇండిపెండెన్స్ డే పేరుతో  ప్రవేశపెట్టబడిన ఈ కొత్త ప్లాన్ ఆగస్టు 10 నుండి అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ 9 నుంచి రూ. 29 వరకు ఉంటుంది.

రూ. 9 ప్రీపెయిడ్ ప్లాన్ 2జీబీ 3జి డేటాను అందిస్తుంది, దీని తర్వాత వేగాన్ని 80 kbps కి తగ్గించబడుతుంది . అంతేకాకుండా ఈ ప్లాన్లో  అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా ఉంది (ఢిల్లీ మరియు ముంబై మినహా), మరియు 100 ఉచిత SMS. ఇది ఒక రోజు వరకు మాత్రమే చెల్లుబాటు  అవుతుంది.

దీనితో పాటుగా రూ .29 ల ప్లాన్ ని కూడా అందించారు . ఇందులో  రూ. 9 ప్లాన్ లోని అన్ని బెనిఫిట్స్ కలిగి వుంది ఐతే ఇది 7 రోజుల చెల్లుబాటుతో పనిచేస్తుంది .

రెండు ప్లాన్స్ కూడా ఉచిత వ్యక్తిగతీకరించిన రింగ్ బ్యాక్ ట్యూన్ (PRBT) సౌకర్యాన్ని కలిగి ఉంటాయి. ఆగస్టు 10 నుండి ఆగస్టు 25 వరకు ఈ ప్లాన్స్ చెల్లుతాయి.  అయితే, జనరల్ కాలింగ్ సౌకర్యంకోసం 1GB వరకు  క్యాప్  చేయబడిందని తెలిపారు . అలాగే, రూ. 27 ప్రణాళికలో అదే ప్రయోజనాలు లభిస్తాయి ఇది సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటుంది.

బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు రిలయన్స్ జియో, ఇతర ప్రైవేటు టెలికాం ప్రొవైడర్లకు వ్యతిరేకంగా తన పోటీని పెంచింది. ఇప్పటి వరకు, జీయో నుంచి 150ఎంబి 4జి  డేటాను రోజువారీ ప్రయోజనాలతో రూ. 19 కి అపరిమిత కాలింగ్ తో పొందవచ్చు. ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ రూ 47 నుండి ప్రారంభమవుతాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :