BSNL ఇటీవలే తన వినియోగదారులకు 191 రూపాయల ప్రత్యేకమైన టారిఫ్ వోచర్ ను ప్రవేశపెట్టింది. ఈ టారిఫ్ ప్లాన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే.వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ రూ 191 ప్లాన్ లో 28 రోజులకు అన్లిమిటెడ్ డేటా ఉంటుంది. యూజర్ రోజువారీ 4G స్పీడ్ తో 1 GB డేటాను పొందుతారు. డైలీ 1 GB డేటా స్పీడ్ ముగిసిన తర్వాత 80 Kbps స్పీడ్ తో అపరిమిత డేటా లభ్యం . డేటాతో పాటు అపరిమిత కాలింగ్ (లోకల్ , ఎస్టీడీ). వినియోగదారులు ఈ ప్లాన్ లో ఉచిత రోమింగ్ కాల్స్ పొందలేరు. ప్లస్ 300 ఉచిత లోకల్ sms లభ్యం. నేషనల్ ఎస్ఎంఎస్ పంపడం కోసం డబ్బు వసూలు చేయబడుతుంది. కంపెనీ 28 రోజులు వాలిడిటీ తో ఈ ప్రణాళికను ప్రవేశపెట్టింది.
BSNL యొక్క 191 రూపాయల ఆఫర్ లిమిటెడ్ టైమ్ పీరియడ్ కొరకు పరిచయం చేయబడింది. ఈ ఆఫర్ జనవరి 10 2018 నుండి ఏప్రిల్ 9 2018 వరకు కేవలం 90 రోజులు చెల్లుతుంది . ప్రస్తుతం, తెలంగాణ సర్కిల్ కోసం ఈ ప్రణాళికను అందించారు.