Exclusive: BSNL 50 రూ లకు 20GB 3G డేటా అనే ఆఫర్ లేదు..

Updated on 22-Apr-2016

BSNL నుండి 50 రూ లకు 20GB 3G ఇంటర్నెట్ ఆఫర్స్ వంటివి ఏమీ రావటం లేదు అని స్పష్టం అయ్యింది. డిజిట్ టీం BSNL జనరల్ మేనేజర్ ను సంప్రదించగా ఈ విషయం పై క్లారిటీ వచ్చింది..

GM సంజయ్ కుమార్ డిజిట్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అసలు ఈ స్టోరీ ఎక్కడ నుండి మొదలయ్యింది అని కూడా తెలియటం లేదు అని అన్నారు..

ప్రస్తుతానికి అయితే అటువంటి ప్లాన్స్ ఏమీ లేవని తెలిపారు bsnl GM. నిన్నటి నుండి ఈ వార్త ఇండియన్ వెబ్  సైట్లలో చాలా చోట్ల హాల్ చల్ చేస్తుంది..

అసలు ఈ ఆఫర్ పై ఇంతకుముందు వచ్చిన స్టోరీ ఏంటో మీకు తెలియకపోతే.. తెలుసుకోవటానికి ఈ లింక్ లోకి వెళ్ళగలరు..

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :