హైదరాబాదీ లకు పండగ

Updated on 26-Apr-2017
HIGHLIGHTS

BSNL ఫ్రీ వై-ఫై సర్వీస్ మొదలుపెట్టింది

హైదరాబాదీ  లకు  పండగ 
 BSNL ఫ్రీ వై-ఫై  సర్వీస్  మొదలుపెట్టింది
 BSNL,  సరికొత్త  వ్యూహ రచన  చేస్తోంది. హైదరాబాద్‌లోని 6  మెయిన్  లోకేషన్స్ లో  ఫ్రీ వై-ఫై  సర్వీస్  మొదలుపెట్టింది. .ఈ పబ్లిక్ వై-ఫైల ద్వారగా మొబైల్  వినియోగదారులకు  4జీ ప్లస్  స్పీడ్  తో  ఇంటర్నెట్ లభిస్తుందని  బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
ఎక్కడైతే వై-ఫై జోన్‌ఏర్పాటు  చేశారో అక్కడ  రోజుకు 100ఎంబి ఇంటర్నెట్  పూర్తిగా  ఫ్రీ . ఒకవేళ లిమిట్ దాటితే  బీఎస్ఎన్ఎల్ పబ్లిక్ వై-ఫై ప్లాన్‌ డేటా వోచర్స్‌ను తీసుకుంటే  వై-ఫై డేటాను  పొందవచ్చు . ఎవరైతే  BSNL మొబైల్ యూజర్  వున్నారో  వారు  డేటా వోచర్లను  కొనక్కరలేదు . వై-ఫై డేటా యూసేజ్‌ను బట్టి మొబైల్ నెంబర్ అకౌంట్ నుంచే డబ్బులు ఆటోమేటిక్ కట్ అవుతాయి.
 వై-ఫై ప్లాన్‌ డేటా వోచర్స్‌ రూ.10 నుంచి రూ.599 వరకు  వున్నాయి . వీటియొక్క  వ్యాలిడిటీ 30 రోజులు .ఎల్‌బీ నగర్‌లోని కామినేని హాస్పటల్స్‌తో పాటు కోటి, అబిడ్స్, జిల్లా ట్రెజరీ కార్యాలయం, అమీర్‌పేట్ ఇంకా గచ్చిబౌలి ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ ఉచిత వై-ఫై సేవలు అందుబాటులో ఉంటాయి.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :