BSNL ఫ్రీ వై-ఫై సర్వీస్ మొదలుపెట్టింది
హైదరాబాదీ లకు పండగ
BSNL ఫ్రీ వై-ఫై సర్వీస్ మొదలుపెట్టింది
BSNL, సరికొత్త వ్యూహ రచన చేస్తోంది. హైదరాబాద్‌లోని 6 మెయిన్ లోకేషన్స్ లో ఫ్రీ వై-ఫై సర్వీస్ మొదలుపెట్టింది. .ఈ పబ్లిక్ వై-ఫైల ద్వారగా మొబైల్ వినియోగదారులకు 4జీ ప్లస్ స్పీడ్ తో ఇంటర్నెట్ లభిస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
ఎక్కడైతే వై-ఫై జోన్‌ఏర్పాటు చేశారో అక్కడ రోజుకు 100ఎంబి ఇంటర్నెట్ పూర్తిగా ఫ్రీ . ఒకవేళ లిమిట్ దాటితే బీఎస్ఎన్ఎల్ పబ్లిక్ వై-ఫై ప్లాన్ డేటా వోచర్స్‌ను తీసుకుంటే వై-ఫై డేటాను పొందవచ్చు . ఎవరైతే BSNL మొబైల్ యూజర్ వున్నారో వారు డేటా వోచర్లను కొనక్కరలేదు . వై-ఫై డేటా యూసేజ్‌ను బట్టి మొబైల్ నెంబర్ అకౌంట్ నుంచే డబ్బులు ఆటోమేటిక్ కట్ అవుతాయి.
వై-ఫై ప్లాన్ డేటా వోచర్స్ రూ.10 నుంచి రూ.599 వరకు వున్నాయి . వీటియొక్క వ్యాలిడిటీ 30 రోజులు .ఎల్‌బీ నగర్‌లోని కామినేని హాస్పటల్స్‌తో పాటు కోటి, అబిడ్స్, జిల్లా ట్రెజరీ కార్యాలయం, అమీర్‌పేట్ ఇంకా గచ్చిబౌలి ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ ఉచిత వై-ఫై సేవలు అందుబాటులో ఉంటాయి.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile