BSNL సరికొత్త వ్యూహ రచన
దిల్ ఖోల్ కే బోల్' పేరుతో రూ.799 ప్లాన్
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం bsnl వారు ప్రజల మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్నారు. జిఓ ఇక ఫ్రీ కాదని తెలుకున్న తరువాత జనాన్ని ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్స్ ను విడుదల చేస్తోంది. దానిలో భాగంగానే దిల్ ఖోల్ కే బోల్' పేరుతో రూ.799 మంత్లీ చెల్లింపుతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు , ఆపై 6 గిగాబైట్ల ఉచిత డేటాను అందిస్తారని సమాచారం. ఎవరైనా ఈ ప్లాన్ తీసుకుంటే వారికి మొదటి నాలుగు మాసాలు 6 జీబీ డేటా, ఆపై నెలకు 3 జీబీ డేటాపొందవచ్చు. ఇక ఎక్స్ట్రా డేటా కావాలనుకుంటే వారికోసం రూ. 1125తో 10 జీబీ, రూ. 1525తో 30 జీబీ డేటాను అందివ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1503, 18001801503 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.