ప్రభుత్వ టెలికం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు శుభవార్త తెలిపింది. BSNL యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G నెట్ వర్క్ మరియు పూర్తిస్థాయి 4G నెట్ వర్క్ వంటి వాటి పైన ఆసక్తికర విషయాలను కంపెనీ ఎట్టకేలకు వెల్లడించింది. దేశవ్యాప్తంగా పూర్థి స్థాయిలో 4G సర్వీస్ లను బిఎస్ఎన్ఎల్ అతిత్వరగా విస్తరణ చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, త్వరలోనే 5G సర్వీస్ లను కూడా ప్రకటించనున్నట్లు తెలిపింది. దేశంలో ఇప్పటికే ఇతర టెలికం సంస్థలు తమ 5G సర్వీస్ లను మొదలు పెట్టగా BSNL త్వరలో అందిస్తాయని చెబుతోంది. BSNL కొత్తగా వెల్లడించిన 4G మరియు 5G గురించి కొత్త న్యూస్ ఏమిటో చూద్దామా.
ఆగస్టు 2023 నాటికి BSNL తన 5G సేవలను ప్రారంభించనుంది. టెలికాం మినిష్టర్ అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని స్వయంగా తెలియపరిచారు. దీని గురుంచి మాట్లాడుతూ, 5G సేవల కోసం BSNL వినియోగదారులు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఎప్పటి వరకూ BSNL 5G సర్వీసులు వస్తాయని కూడా వెల్లడించారు. BSNL యొక్క 5G సర్వీస్ కూడా ఆగస్టు 15, 2023 నాటికి ప్రారంభించబడుతుందని ఆయన పేర్కొన్నారు.
అలాగే, BSNL 4G సర్వీస్ విస్తరణ గురించి కొత్తగా వస్తున్న నివేదికలను విశ్వసితే, 2023 సంవత్సరం జనవరి నాటికి దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ 4G నెట్ వర్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. అంటే, 2023 వ సంవత్సరం BSNL కంపెనీకి మరియు వినియోగదారులకు కూడా శుభప్రభంగా ఉండవచ్చని అంచనా వేయవచ్చు. 4G నెట్ వర్క్ కోసం ఎదురు చూస్తున్న BSNL వినియోగదారులకు ఈ కొత్త న్యూస్ నిజంగా గుడ్ న్యూస్ అవుతుంది.