లావా ఇంకా మైక్రోమ్యాక్స్ తో BSNL సరికొత్త ధమాఖా .

Updated on 09-Oct-2017

ఎయిర్టెల్ మరియు జియో తర్వాత,  BSNL కూడా స్మార్ట్ఫోన్ తో  కలవడం ద్వారా  వినియోగదారులను సమీకరించాలని కోరుకుంటుంది. నిజానికి, బిఎస్ఎన్ఎల్ లావా మరియు మైక్రోమ్యాక్స్ తో కలిసి  పార్టనర్ షిప్ పెట్టుకుంది . ఈ దేశీయ స్మార్ట్ఫోన్ తయారీదారుల తో కలిసి  సంస్థ స్మార్ట్ఫోన్లో డేటా అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ లావా, మైక్రోమ్యాక్స్లతో కలిసి బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు తక్కువ ధరల వద్ద ఆఫర్లు  అందిస్తుంది . ఈ భాగస్వామ్యంలో, తక్కువ ధర గల స్మార్ట్ఫోన్లు ఉపయోగించబడతాయి, అంటే, కంపెనీలు జియోఫోన్ కు  నేరుగా  కౌంటర్ ఇవ్వాలని  కోరుకుంటున్నాయి.

ఈ  డీల్ లో ఉన్న స్మార్ట్ఫోన్ ధర రూ .2,500 లేదా ఇంకా తక్కువగా ఉంటుంది. ఇటీవలే, బిఎస్ఎన్ఎల్ దాని కొత్త ప్యాక్ రూ 429 ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ BSNL ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే. BSNL ఈ  ప్లాన్ లో ఫ్రీ వాయిస్ కాల్స్ అందిస్తుంది, ఇది లోకల్ మరియు STD రెండు అన్ని నెట్వర్క్లకు వర్తిస్తుంది. ఇది 90GB డేటాను కలిగి ఉంది, ఇది పాన్ ఇండియా ఆధారంగా 90 రోజులు ఇవ్వబడుతుంది.

అదనంగా, ఎయిర్టెల్ ఈ రోజుల్లో తక్కువ మరియు చౌకగా స్మార్ట్ఫోన్ అందించే ట్రైల్స్ లో  ఉంది. దీపావళికి ముందు ఈ ఫోన్ ని  ఎయిర్టెల్ ప్రారంభించవచ్చు. దాని ధర 2500 రూపాయలు ఉంటుంది. జియోఫోన్ తన ఫీచర్ ఫోన్ అయిన  జియోఫోన్ ని  డెలివరీకి చేస్తోంది. దీపావళికి ముందు ఈ ఫోన్ డెలివరీ పూర్తి అవుతుంది.

 

Connect On :