బ్రహ్మాస్త్రం సినిమా టికెట్ రూ.75 కే పొందే గొప్ప అవకాశం.!

బ్రహ్మాస్త్రం సినిమా టికెట్ రూ.75 కే పొందే గొప్ప అవకాశం.!
HIGHLIGHTS

'బ్రహ్మాస్త్ర సినిమా' సెప్టెంబర్ 9 న థియేటర్లలో విడుదల కాబోతోంది

ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది

ఈ సినిమా రిలీజ్ కంటే ముందే గొప్ప న్యూస్ బయటకి వచ్చింది

రణభీర్ కపూర్ మరియు ఆలీయా భట్ నటించిన ఫాంటసీ అడ్వాంచర్ సినిమా 'బ్రహ్మాస్త్రం సినిమా' సెప్టెంబర్ 9 న థియేటర్లలో విడుదల కాబోతోంది. బాలీవుడ్ తో పాటుగా సౌత్ యాక్టర్స్ కూడా నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. అయితే, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కంటే ముందే గొప్ప న్యూస్ బయటకి వచ్చింది. అదేమిటంటే, ఈ సినిమాను కేవలం 75 రూపాయల ఖర్చుతోనే థియేటర్లలో వీక్షించే గొప్ప అవకాశం.

ఈ సినిమా టికెట్ పైన ఎటువంటి కన్సెషన్ కూడా ఈ చిత్ర నిర్మాతలు లేదా మరింకెవరినా అందిస్తున్నారు? అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే, ఈ తక్కువ రేటు టిక్కెట్ వెనుక వేరే కథ వుంది. అదేమిటంటే, సెప్టెంబరు 16న దేశంలో జాతీయ సినిమా దినోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. ఈ రోజును పురస్కరించుకొని ఆ రోజున దేశంలోని దాదాపు 4000 స్క్రీన్లలో సినిమా టిక్కెట్లను కేవలం రూ.75 కే అందించబోతున్నారు. దీనికోసం, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

 

 

ఈ కార్యక్రమం ద్వారా సెప్టెంబరు 16న దేశంలో జాతీయ సినిమా దినోత్సవ సందర్భంగా రూ.75 రూపాయలకే 'బ్రహ్మాస్త్ర పార్ట్ 1' సినిమా టికెట్ ను పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo