బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ ఇవే..!!

బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ ఇవే..!!
HIGHLIGHTS

బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ గ నిలిచిన సినిమాలు

పెద్ద హీరోలు నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడం గమనార్హం

2022 సంవత్సరం డిజాస్టర్ గా నిలిచిన సినిమాల లిస్ట్

ఈ సంవత్సరం చాలా బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే, కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ గా పేరు తెచ్చుకున్నాయి. వాస్తవానికి, మంచి కథతో పాటుగా పెద్ద హీరోలు నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడం గమనార్హం. ఈ త్రోవలో బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఉండడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకే, ఈరోజు 2022 సంవత్సరం డిజాస్టర్ గా నిలిచిన సినిమాల గురించి చూద్దామా.

అటాక్

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించిన 'అటాక్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను నిర్మించడానికి 80 కోట్లకు పైగా ఖర్చుపెట్టగా, ఈ సినిమా 20 కోట్ల రూపాయల ను మాత్రామే వసూలు చెయ్యగలిగింది. ఈ సినిమాలు గ్లామర్ క్వీన్స్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు కూడా తమ అందాలను ఆరబోసినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమా Zee5 నుండి స్ట్రీమ్ అవుతోంది.    

పృథ్వీరాజ్

సామ్రాట్ పృథ్వీ రాజ్ చౌహన్ జీవితం ఆధారంగా నిర్మిచిన చారిత్రక యాక్షన్ డ్రామా సినిమా ఈ 'సామ్రాట్ పృథ్వీ రాజ్'. ఈ సినిమాలో పృథ్వీ రాజ్ చౌహన్ గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించగా సంజయ్ దత్ మరియు సోనూ సూద్ ప్రధాన పాత్రలను పోషించారు. జూన్ 3 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అదే సమయంలో విడుదలైన 'విక్రమ్' మరియు 'మేజర్' దెబ్బకి ఈ సినిమా థియేటర్లలో నిలబడలేకపోయింది. ఈ సినిమా Prime Video నుండి స్ట్రీమ్ అవుతోంది.

83

ఈ చిత్రంలో నటి నటులు అద్భుతమైన నటన కనబరిచినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించిన అల్లు అర్జున్ మూవీ 'పుష్ప' ది రైజ్ మరియు అదే సమయంలో విడుదలైన హాలీవుడ్ చిత్రం స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్. అందులోనూ ముఖ్యంగా, పుష్ప సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మరింతగా ఆకట్టుకోవడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అయితే, క్రికెట్ క్రేజ్ ఎక్కువగా ఉన్న మన దేశంలో చారిత్రక క్రికెట్ ఘట్టాన్ని తెరకెక్కిచినా అంతగా ఆడకపోవడం ఆశ్చర్యకరమైన విషయంగానే చెప్పుకోవచ్చు. ఈ సినిమా Netflix మరియు Disney+ Hotstar లో స్ట్రీమ్ అవుతోంది.

రాధే శ్యామ్

రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మార్చి 11న థియేటర్లలో విడుదలయ్యింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే మరియు భాగ్యశ్రీ కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించారు మరియు ఈ చిత్రానికి కె.కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1970 ల కాలం నాటి యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామా చిత్రం. అలాగే, ఈ సినిమాలో విజువల్స్ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయని కితాబు అందుకున్నారు. అయితే, సినిమా బాక్సీఫీస్ వద్ద ఆశించిన స్థాయిని అందుకోలేక పోయింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో నుండి స్ట్రీమ్ అవుతోంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo