boAt Smart Ring: స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ ల తర్వాత స్మార్ట్ వాచీల ట్రెండ్ కొనసాగింది. అయితే, ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోంది. అదే, స్మార్ట్ రింగ్ ట్రెండ్. అయితే, స్మార్ట్ రింగ్ అధిక ధరలో మాత్రమే రావడంతో బడ్జెట్ యూజర్ల చేతికి అందకుండా పోయింది. కానీ, ప్రముఖ ఇండియన్ బ్రాండ్ బోట్ కొత్తగా తెచ్చిన బడ్జెట్ స్మార్ట్ రింగ్ తో ఈ దూరం చెరిగి పోయింది. బోట్ బడ్జెట్ ధరలో స్మార్ట్ రింగ్ యాక్టివ్ పేరుతో లాంచ్ చేసిన స్మార్ట్ రింగ్ ఈ దూరాన్ని చెరిపివేసింది.
బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ ను కేవలం రూ. 2,999 ధరలో భారత మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ స్మార్ట్ రింగ్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు బోట్ వెబ్సైట్ నుండి లభిస్తుంది. ఈ స్మార్ట్ రింగ్ ను ప్రస్తుతం కేవలం రూ. 1 రూపాయి చెల్లించి ప్రీ బుక్ చేసుకోవచ్చు. రేపటి నుంచి ఈ బోట్ స్మార్ట్ రింగ్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: Prime Day సేల్ కంటే ముందే Sony Smart Tv పైన అమెజాన్ ధమాకా ఆఫర్.!
బోట్ స్మార్ట్ రింగ్ ను చాలా స్మార్ట్ ఫీచర్స్ తో అందించింది. ఈ స్మార్ట్ రింగ్ అనేక రకాలైన హెల్త్ మోనిటర్స్ తో వస్తుంది. ఇందులో హార్ట్ రేట్, స్ట్రెస్ మోనిటర్, spO2 మోనిటర్, స్లీప్ మోనిటర్ మరియు స్టెప్ కౌంట్ ఫీచర్స్ తో ఉంటుంది. ఈ బోట్ స్మార్ట్ రింగ్ మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్ ట్రాకింగ్ లతో కూడా వస్తుంది.
బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ ను కేవలం 4.7 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఈ స్మార్ట్ రింగ్ లైట్ వెయిట్ లో ఉన్నా స్టెయిన్ లెస్ స్టీల్ డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ రింగ్ సింగల్ ఛార్జ్ తో 5 రోజుల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఇది కేసు ఛార్జ్ తో 30 రోజుల బ్యాకప్ అందిస్తుంది. ఈ బోట్ స్మార్ట్ రింగ్ 5 ATM డస్ట్, స్వెట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
బోట్ తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ రింగ్ ను యూజర్ కు తగిన సైజుల్లో కూడా అందిస్తుంది. ఈ రింగ్ 7 నుంచి 12 స్మార్ట్ యాక్టీవ్ సైజుల్లో లభిస్తుందని కూడా బోట్ తెలిపింది.