బ్లూ వెల్ ఇది ఒక గేమ్ పేరు. ఇప్పుడు ఈ పేరు వింటేనే అందరి గుండెల్లో వణుకు పుట్టుకొస్తోంది. ఒక గేమ్ పేరు వింటేనే అందరూ ఎందుకు ఇలా భయపడుతున్నారు. అసలు దీనిలో ఏముంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇది ఒక కధ కాదు దీనిని ప్రతీ పేరెంట్స్ కూడా హెచ్చరికగా భావించి మీపిల్లలని ఈ భూతం నుండి కాపాడుకోవాలిసిన బాధ్యత మీదే . ఎందుకంటే ఈ గేమ్ భారిన పడి దాదాపు 250 పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. మరియు కేవలం రష్యా లోనే 130 పిల్లలు మరియు టీనేజర్స్ బలైపోయారు. అంటే చూడండి ఇది ఎంత భయంకరమైన గేమ్..? ఈ గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆత్మహత్యకు ప్రేరేపించటం .
ఈ గేమ్ ను సాధారణ గేమ్స్ లా డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేయలేరు . మరియు మీకు ఇది ప్లే స్టోర్ లో లభించదు . అంతకంటే ముఖ్యంగా దీనికి ఎటువంటి వెబ్సైటు కూడా లేదు . అంతకంటే ముఖ్యంగా దీనిని బ్లాక్ కూడా చేసే వీలు లేదు . ఇది ఒక ఛాలెంజింగ్ గేమ్ దీనిలో 50 టాస్కులు 50 డేస్ లో కంప్లీట్ చేయవలిసి ఉంటుంది .
ఈ గేమ్ లోని కండీషన్స్ ఏమిటంటే
మీరు ఆట ముగిసే వరకు ఈ గేమ్ వదలకూడదని క్యూరేటర్ ముందుగానే మీకు వార్నింగ్ ఇస్తాడు . అతను అడిగే అన్ని ప్రశ్నలకు మీరు తప్పకుండా ఆన్సర్ చేయాలి . ఒకవేళ మీరు ఆట ముందు ఆడటానికి నిరాకరిస్తే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉందని మరియు మీ వ్యక్తిగత సమాచారాన్నిమొత్తం బయట పెడతానని తరువాత మిమ్మల్ని మీఇంటికి వచ్చి మీ సంభందిత వ్యక్తులను చంపివేస్తానని తీవ్ర తర స్థాయి లో బెదిరిస్తాడు. సో ఈవిధముగా పిల్లలు దీనిలో చిక్కుకుంటారు. ఆతరువాత గేమ్ లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఇస్తాడు . చేతి మీద బ్లేడ్ తో వేల్ అని చెక్కుకోవాలి . ఆ తరువాత
ఉదయం 4:20 లకు లేచి అతి భయంకరమైన వీడియో తప్పకుండా చూడాలి .
మీ పేస్ బుక్ స్టేటస్ లో #I’m a Whale అని రాయాలి . ఇక ఆఖరిది
ఒక పొడవైన భవనం ఎక్కిఆత్మహత్య చేసుకోవటం అల్టిమేట్ ఛాలెంజ్ .
ఇలా ఉంటుంది సో దయచేసి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి . ఇది చాలా డెంజరస్ గేమ్
ఈ గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆత్మహత్యకు ప్రేరేపించటం . ఈ గేమ్ ని తయారు చేసిన వ్యక్తి ఇప్పటికే పోలీసుల అదుపులో వున్నాడు . అయినప్పటికీ ఈ గేమ్ కొనసాగుతూనే వుంది . కొన్ని రోజుల క్రితం ముంబై లో మన్ ప్రీత్ అనే టీనేజర్ ఇప్పటికే ఈ గేమ్ కి బలయ్యాడు . ఇప్పుడు తాజాగా కేరళ లో మరొక టీనేజేర్ ఈ గేమ్ బారిన పడ్డాడు . దీనిలో ముఖ్యంగా ఎవరైతే ఆత్మవిశ్వాసం మరియు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ కలిగి వుంటారో వారే ఈ గేమ్ కి మెయిన్ టార్గెట్ . దీని నుండి బయట పడటానికి సాధ్యమైనంత వరకు ఇటువంటి ఇంటర్నెట్ గేమ్స్ కి దూరంగా మీ పిల్లలని పెట్టండి . ఎటువంటి మెసేజెస్ ఓపెన్ చేయవద్దని చెప్పండి . ముఖ్యంగా మీ పిల్లలకు ప్రేమ ని ఇవ్వండి .
Flipkart లో భారీ డిస్కౌంట్స్ …!!! అన్నీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ….!!!