ఈరోజు క్రిందకు దిగిన గోల్డ్ రేట్..లైవ్ అప్డేట్ తెలుసుకోండి.!
ఈ వారం ప్రారంభం నుండి భారిగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్
నిన్న ఆల్ టైమ్ హై రేట్ ను తాకిన గోల్డ్ మార్కెట్ ఈరోజు మాత్రం క్రిందకు దిగజారింది
గత నాలుగు రోజుల ధరతో పోలిస్తే మాత్రం ఇది భారీ తగ్గింపు
ఈ వారం ప్రారంభం నుండి భారిగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్ కి ఈరోజు బ్రేకులు పడ్డాయి. నిన్న ఆల్ టైమ్ హై రేట్ ను తాకిన గోల్డ్ మార్కెట్ ఈరోజు మాత్రం క్రిందకు దిగజారింది. కానీ, ఈరోజుకి కూడా బంగారం ధర 61 వేల పైనే కొనసాగుతోంది. అయితే, గత నాలుగు రోజుల ధరతో పోలిస్తే మాత్రం ఇది భారీ తగ్గింపు, అనిచెప్పొచ్చు. ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎంత పడిపోయింది, లైవ్ రేట్ వంటి వివరాలను తెలుసుకుందామా.
Today's Gold Update
ఈరోజు మార్కెట్ లో బంగారం ధర 700 పైగా క్రిందకు దిగజారింది. ఈరోజు 56,650 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22K గోల్డ్ రేట్, 700 రూపాయల నష్టాన్ని చవిచూసి 55,950 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదే విధంగా, 10 గ్రాముల 24K గోల్డ్ ధర కూడా 760 రూపాయల నష్టాన్ని చూసి రూ.61,040 వద్ద కొనసాగుతోంది. మొత్తంగా, ఈరోజు గోల్డ్ మార్కెట్ నష్టాలతో ముగిసింది.
ఈ వారం గోల్డ్ రేట్
ఇక ఈ వారం మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా వుంది? అని పరిశీలిస్తే, ఈ వారం మొత్తం మీద ఓవరాల్ గా గోల్డ్ మార్కెట్ లాభాలతోనే ముగిసింది. ఎందుకంటే, సోమవారం రూ.55,400 వద్ద స్టార్ట్ అయిన ఒక తులం 22K బంగారం ధర ఈరోజు 55,950 రూపాయల వద్ద ముగిసింది. అంటే, ఓవరాల్ గా 550 రూపాయల పెరుగుదల చూసింది. అలాగే, రూ.60,430 వద్ద ప్రారంభమైన ఒక తులం 24K గోల్డ్ రేట్ ఈరోజు 61,040 రూపాయల వద్ద ముగిసింది.
హైదరాబాద్ & విజయవాడ
ఈరోజు మన తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్ & విజయవాడ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ.55,960 గా ఉండగా, 24K గోల్డ్ రేట్ రూ.61,040 రూపాయలుగా ఉంది. విజయవాడలో కూడా 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ.55,960 గా ఉండగా, 24K గోల్డ్ రేట్ రూ.61,040 రూపాయలుగా ఉంది.
Note: గోల్డ్ లైవ్ రేట్ మరియు మార్కెట్ ధరలో వ్యత్యాసాలు ఉంటాయి.