పసిడి ధర ప్రస్తుతం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. గత వారం చివరి వరకూ మార్కెట్ లో నిలదోక్కుకున్న బంగారం ధర, వారం చివరి రోజున భారీగా నష్టాలను చూసింది. అంతేకాదు, నెల రోజుల కనిష్ఠ ధరలో ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ కొనసాగుతోంది. అయితే, గోల్డ్ రేట్ ను అంచనా వేస్తున్న నిపుణులు మాత్రం గోల్డ్ పెరిగే అవకాశం ఉందనే చెబుతున్నారు. కానీ, నిన్న మొన్నటి వరకూ 62 వేల వద్ద కొనసాగిన గోల్డ్ మార్కెట్ ఈరోజు 60 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది. ఈరోజు తెలుగు రాష్ట్రాలు మరియు దేశంలోని ఇతర ప్రధాన మార్కెట్ లలో బంగారం తులం రేటు కొనసాగుతుందో తెలుసుకోండి.
ఈరోజు 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 60,330 రూపాయల వద్ద కొనసాగుతోంది మరియు 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 55,300 వద్ద కొనసాగుతోంది. జూన్ 2 న గోల్డ్ రేట్ రూ.61,100 (10గ్రా 24K ) వద్ద ఉండగా, శనివారం ఒక్కసారిగా రూ. 770 రూపాయల భారీ తరుగుదలను చూసి రూ. రూ. 60,330 వద్ద నిలబడింది. అలాగే, శనివారం క్లోజింగ్ తరువాత ఈరోజు మార్కెట్ లో నిలకడగా నిచ్చిన గోల్డ్ రేట్ ఇదే రేటులో కొనసాగుతోంది.
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్, నిజామాబాద్, గుంటూరు మరియు ప్రొద్దుటూరు లలో ఈరోజు పైన తెలిపిన గోల్డ్ రేట్ లు కొనసాగుతున్నాయి. అంటే, ఈ ప్రధాన మార్కెట్ లలో ఈరోజు 10 గ్రాముల 24K బంగారం ధర రూ. 60,330 వద్ద ఉండగా, 10 గ్రాముల 22K బంగారం ధర రూ. 55,300 వద్ద కొనసాగుతోంది.
ఇక ఈరోజు ఇతర మార్కెట్ లలో గోల్డ్ రేట్ వివరాలను చూస్తే, ఈరోజు కూడా చెన్నై మార్కెట్ లో గోల్డ్ రేట్ గరిష్ఠ ధరలో కొనసాగుతోంది. ఈరోజు చెన్నై మార్కెట్ లో రూ. 55,700 వద్ద 10గ్రా 22K గోల్డ్ రేట్ ఉండగా 10గ్రా 24K గోల్డ్ రేట్ రూ. 60,760 వద్ద కొనసాగుతోంది.