Gold Price Drop: ఈరోజు పసిడి ప్రియులకు శుభతరుణం.!

Updated on 11-Oct-2022
HIGHLIGHTS

ఈరోజు పసిడి ప్రియులకు శుభతరుణం

గోల్డ్ రేట్ కి ఈరోజు బ్రేకులు పడ్డాయి

ఈరోజు గోల్డ్ రేట్ డౌన్ ట్రేడ్ చేస్తోంది

Gold Price Drop: ఈరోజు పసిడి ప్రియులకు శుభతరుణం. మార్కెట్లో అంతకంతకు పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్ కి ఈరోజు బ్రేకులు పడ్డాయి. గత నెల చివరి నుండి మార్కెట్లో బంగారం ధర రోజు రోజుకు పెరిగింది మరియు నిన్న దాదాపుగా 53 వేలకు దగ్గరగా వచ్చి చేరుకుంది. అయితే, ఈరోజు మాత్రం తులానికి 770 రూపాయల వరకూ మార్కెట్ లో బంగారం తగ్గింది. మరి ఈరోజు గోల్డ్ రేట్ ఎలా కొనసాగుతోందో తెలుసుకుందామా.

Gold Rate:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,600 రూపాయలుగా ఉండగా, ఈరోజు 700 రూపాయలు క్రిందకు దిగజారి 46,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,160 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.51,100 గా ఉంది. ఈరోజు కూడా   దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710 గా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :