ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం ఒక చైల్డ్ మెంబెర్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది, ఇందులో ఇద్దరు వ్యక్తులు ఒక ప్లాన్ ధరతో బెనిఫిట్ ని పొందవచ్చు.వాస్తవానికి, కంపెనీ యొక్క ఈ పోస్ట్పెయిడ్ ప్లాన్ లో , ఒక వినియోగదారు Add On Connections స్కీమ్ లోఒక యూజర్స్ మరో యూజర్ ను ఏ అదనపు ఛార్జీ లేకుండా మ తన ప్లాన్ లో జోడించగలరు. పేరెంట్ యూజర్ యొక్క అన్ని బెనిఫిట్ చైల్డ్ మెంబెర్స్ కి కూడా లభ్యం .
ఎయిర్టెల్ యొక్క పోస్టుపైడ్ ప్లాన్ రూ .799 మరియు రూ .1199 ల ప్లాన్స్ లో యాడ్ ఆన్ కనెక్షన్ స్కీమ్ లాభం పొందవచ్చు. వినియోగదారులు ఈ ప్లాన్ లో ఏ సభ్యుడినైనా చేర్చగలరు. మీరు 799 రూపాయల పోస్టాపెయిడ్ ప్లాన్ గురించి మాట్లాడినట్లయితే, ఒక్క సభ్యుడు మాత్రమే దీనిలో చేర్చవచ్చు. ఈ ప్లాన్లో మొత్తం 50 GB డేటా లభ్యం , ఇది ఇద్దరు వినియోగదారులకు విభజించబడుతుంది. దీనితో పాటు, ఇద్దరు వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , STD మరియు రోమింగ్) మరియు అవుట్గోయింగ్ కాల్స్ పొందుతారు.
రూ. 1,199 పోస్ట్ పైడ్ ప్లాన్ గురించి మాట్లాడితే , దీనిలో ప్రధాన యూజర్ ఇద్దరు ఇతర సభ్యులను కలిగి ఉండవచ్చు. ఈ ప్లాన్ లో మొత్తం 75 GB డేటా అందుబాటులో ఉంది, వారి అవసరాలకు అనుగుణంగా ముగ్గురు ఖర్చు చేసుకోవచ్చు . ఈ ప్లాన్లో, ముగ్గురు వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , STD మరియు రోమింగ్) మరియు అవుట్గోయింగ్ కాల్స్ పొందుతారు.
ఈ రెండు ప్లాన్ల తో పాటుగా, ఎయిర్టెల్ తన పోస్టుపైడ్ వినియోగదారులకు రూ. 399 మరియు 499 రూపాయలప్లాన్ లను కూడా ప్రవేశపెట్టింది. ఏదేమైనప్పటికీ, ఈ రెండు ప్లాన్ లో సభ్యులను చేర్చలేరు. రూ. 399 ప్లాన్ లో వినియోగదారులు మొత్తం 10 GB డేటా పొందుతారు. దీనితో పాటు, అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , STD మరియు రోమింగ్) అందుబాటులో ఉంటుంది. రోమింగ్లో అవుట్గోయింగ్ కాల్స్ కోసం వినియోగదారులు ఛార్జ్ చేయబడతారు.
ఎయిర్టెల్ యొక్క రూ 499 ప్లాన్ గురించి మాట్లాడితే , యూజర్ మొత్తం 30 GB డేటా పొందుతారు. అలాగే, అపరిమిత వాయిస్ కాల్స్ (లోకల్ , STD మరియు రోమింగ్) అందుబాటులో ఉన్నాయి . రోమింగ్లో అవుట్గోయింగ్ కాల్స్ కోసం వినియోగదారులు ఛార్జ్ చేయబడతారు. ఈ ప్లాన్ లో సభ్యులను కూడా చేర్చలేరు. ఈ ప్లాన్లన్నీ నెలవారీ వాలిడిటీ తో సమర్పించబడ్డాయి.