2022 జూలై లో సెక్యూరిటీ లోపల కారణంగా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) ను ఇండియాలో నిషేదానికి గురయ్యింది. BGMI అప్పటికే అత్యధికంగా డౌన్ లోడ్స్ మరియు యూజర్లను సాధించిన జనరంజక యాప్ గా విరాజిల్లుతోంది. అయితే, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ,మళ్ళీ తిరిగి అడుగుపెట్టింది. kraftan ఆధ్వర్యంలోని ఈ గేమింగ్ యాప్ ను ఇప్పుడు మీరు Google Play Store నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) గేమ్ ఇండియాలో బ్యాన్ అయ్యే నాటికి ఇండియాలో 100M కి పైగా డౌన్ లోడ్స్ ను సాధించింది. అంతేకాదు, బ్యాన్ అయ్యే సమయానికి ఇండియాలో అత్యధికంగా రెవిన్యూ సాధించిన ఆండ్రాయిడ్ యాప్ గా కూడా చరిత్ర సృష్టించింది. అయితే, దేశ ప్రజల డేటా సెక్యూరిటీ కారణంగా ఈ యాప్ ను ప్రభుత్వం ఇండియాలో పూర్తిగా బ్యాన్ చేసింది.
అయితే, ఈ యాప్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకున్న వారు ఈ గేమ్ ని ఆడే అవకాశం ఉండడంతో చాలా 59% మంది ఈ గేమ్ ను కంటిన్యూ అయినట్లు కూడా నివేదికలు తెలిపాయి. అయితే, కొత్త ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకు అవకాశం లేకుండా పోయింది.
https://twitter.com/BattlegroundmIn/status/1663050802146181120?ref_src=twsrc%5Etfw
ఇప్పుడు ఈ గేమింగ్ యాప్ పైనా ప్రభుత్వం బ్యాన్ ఎత్తి వేయడంతో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) ను మీరు Google Play Store నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.