ఈ ఆప్ డౌన్లోడ్ చేస్తే, మీ ఫోన్ అది చెప్పినట్లు (రిమోట్ యాక్సెస్) వింటుంది.
ప్రస్తుతం, ఎక్కడ చూసినా ఆన్లైన్ మోసాలు మరింతగా పెరిగిపోయాయి. టెక్నాలజీ పుణ్యమా అని నుంచున్నచోటనుండే,అన్ని పనులను క్షణాల్లో చక్కబెట్టిస్తున్నాం. ఇందులో, ప్రధానంగా ముందుండేది స్మార్ట్ ఫోన్ అని తడుముకోకుండా చెప్పొచ్చు. ఎందుకంటే, ప్రస్తుతం వున్నా స్మార్ట్ ఫోన్లతో, కేవలం ఫోన్లను మాట్లాడం మాత్రం కాకుండా, గేమ్స్, కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేయడం, సినిమాలు, ఇంకా చెప్పుకుంటూపోతే, చాంతాడంత లిస్ట్ తయారవుతుంది. కానీ, ఇదే అదునుగా కొంతమంది నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు.
ఇప్పుడు, కొత్తగా ఇటువంటి మోసం ఒకటో వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే, ఒక అనామక ఆప్ డౌన్లోడ్ చేసుకుని దానికి తగిన యాక్సెస్ ఇచ్చిన కారంణంగా, తన బ్యాంకు అకౌంట్ లోని డబ్బును కోల్పోయినట్లు ఒక బాధితుడు వాపోయాడు. అసలు విషయమేమిటంటే, AnyDesk అనే ఒక App ని సదరు బాధితుడు డౌన్లోడ్ చేసుకున్నారు, ఆతరువాత ఈ App ద్వారా ఒక కోడ్ ని పంపించి తద్వారా ఈ ఫోన్ యొక్క రిమోట్ యాక్సెస్ అందుకున్నారు, హ్యాకర్లు. ఆతరువాత మాములు ఆప్స్ మాదిరిగానే, అన్ని అనుమతులను సదరు బాధితుని ద్వారా అందుకొన్నారు. ఇంకేముంది, ఆ వ్యక్తి ఖాతా నుండి యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా అతని ఖాతాలో ఉన్నదంతా ఊడ్చేశారు.
ఈ ఘటన జరిగిన తరువాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తమ వినియోగదారులకి ఈ డిజిటల్ మోసాల గురించి సరైన అవగాహన, బ్యాంకులు తెలిపయపరిచేలా చర్యలు చేపట్టమని,ఆదేశించినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే, ముందుగా జాగ్రత్తగా ఉండవలసింది మనమే. ఎందుకంటే, అసలు ఎటువంటి దిశా నిర్ధేశాలు మరియు ద్రువీకరణలు లేనటువంటి అనామక ఆప్ లను డౌన్లోడ్ చేయడం చివరికి మనకు అనుకోని పరిణామాలకు దారితీసేలా చేస్తుంటాయి. ఇప్పుడు మనకు స్మార్ట్ ఫోన్ కూడా ఒక బ్యాంక్ లాంటిది కాబట్టి, వీలైనంత జాగ్రత్తవహించండి.