AC కొనే ముందు గుర్తు పెట్టుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇవే.!

Updated on 23-Feb-2023
HIGHLIGHTS

AC కొనుగోలు చేసే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సి విషయాలు

AC ని కొనాలని చూస్తున్నట్లయితే, ముందుగా కొన్ని విషయాలను పరిశీలించడం మంచిది

మీ ఇంటిని చల్లగా ఉంచడానికి మీఇంటికి తగిన ఒక మంచి AC

ప్రస్తుతం నమోదవుతున్న వాతావరణ వివరాలు చూస్తుంటే ఎండాకాలం వచ్చేసినట్లే అనిపిస్తోంది. అంతగా ఎండలు మండి పోతున్నాయి మరియు ఫ్యాన్ లకు పనిచెప్పడం కూడా మొదలు పెట్టేశారు. అయితే, మీ ఇంటిని చల్లగా ఉంచడానికి మీఇంటికి తగిన ఒక మంచి AC ని కొనాలని చూస్తున్నట్లయితే, ముందుగా కొన్ని విషయాలను పరిశీలించడం మంచిది. మరి మీరు AC కొనే ముందుగా మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన ఆ ముఖ్యమైన విషయాలు ఏమిటో ఈరోజు చూద్దామా. 

1. గది పరిమాణం

AC కొనుగోలు చేసే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఆ AC ని ఏ గదిలో అమర్చాలనుకుంటున్నాము. ఎందుకంటే, మనము ఎంచుకునే గది యొక్క పరిమాణాన్ని బట్టి మనం తెసుకోవాల్సిన AC యొక్క కెపాసిటీ ని అంచనా వేయాల్సి ఉంటుంది.

ఉదా : బెడ్ రూమ్, ఒక సాధారణ బెడ్ రూమ్ కోసం 1 టన్ నుండి 1.2 టన్ కెపాసిటీ AC అవసరమవుతుంది. అదే ఒక మీడియం హాల్ కోసం కనీసం 1.5 టన్ AC అవసరమవుతుంది.

2.  విద్యుత్ వినియోగం

AC కొనేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకొవాల్సిన విషయం, విద్యుత్ వినియోగం అని కచ్చితంగా చెప్పోచ్చు. ఎందుకంటే, AC అత్యధికమైన విద్యుత్ వినియోగాన్ని తీసుకుంటుంది. కాబట్టి, మనకు ఎక్కువ బిల్ వస్తుంది. అందుకోసమే, తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువగా పనిచేసేలా వుండే AC లను ఎంచుకోవడం మంచిది. ఎక్కువగా స్టార్స్ ఉన్న AC లు ఎక్కువగా ప్రయోజనాలను ఇస్తాయి.

3. కాపర్ కండెన్సర్ కాయిల్

AC కండెన్సర్లు గాలిని చల్లబరచి మనకు అందించానికి కాయిల్స్ ను ఉపయోగించుకుంటాయి. అయితే, మనకు తెలుసు కాపర్ అత్యంత వేగవంతమైన ఉష్ట్న వాహకమని, కాబట్టి కాపర్ కాయిల్స్ ఉన్న AC లను ఎంచుకోవడం ద్వారా అత్యంత త్వరగా చల్లబరిచే స్వభావాన్ని మీరు మీ AC నుండి పొందుతారు.

4. ఇన్వర్టర్ సాంకేతికత

మీకు పూర్తి సేవింగ్స్ అందించే ఒక స్మార్ట్ AC ని కనుక మీరు కొనాలనుకుంటే ఇన్వర్టర్ టెక్నలాజి కలిగిన AC ని ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే, ఇన్వర్టర్ టెక్నలాజి AC లు అతితక్కువగా విద్యుత్తును వినియోగించుకుని పనిచేస్తాయి. కాబట్టి, మీకు తక్కువగా కరెంట్ బిల్ వస్తుంది. అంతేకాకుండా, ఇందులో అందించే సాంకేతికతతో  AC యొక్క కంప్రెషర్ ఎక్కువ కాలం పనిచేస్తుంది.

5. అధనపు ఫీచర్లు

ఒక AC ఎంచుకునేప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సామాన్యంగా, మనకు చాలా ఎంపికలతో AC లు దొరుకుతుంటాయి కానీ మన ఇంటి వాతవరణ పరిస్థితులకు అనుగుణమైన ఫిచర్లు కలిగిన వాటిని తెలుసుకుని ఎంచుకోవాలి. ఉదాహరణకు, మీ ప్రాంతంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉంటే గనుక దానికి అనుగుణంగా హ్యూమిడిఫైర్ కలిగిన AC ని ఎంచుకోవాలి. అలాగే, బ్యాక్టీరియా ని తొలగించే అప్షన్ మరియు అనేక విధాలైన ఫీచర్లతో మీకు కావాల్సిన వాటిని ఎంచుకొని వాటన్నిటిని కలిగిన ఒక మంచి AC ఎంచుకోండి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :