AC Blast: పేలిపోతున్న ఏసీలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.!

AC Blast: పేలిపోతున్న ఏసీలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.!
HIGHLIGHTS

‘పేలిపోతున్న ఏసీలు’ అనే కథనాలు మరియు వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి

దేశంలో పెరిగిన ఉష్టోగ్రతలు, వాతావరణంలో మార్పులు కారణంగా ఊహిస్తున్నారు

, స్ప్లిట్ ఏసీ లను కొనేముందు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

AC Blast: ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పేలిపోతున్న ఏసీలు’ అనే కథనాలు మరియు వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దేశంలో పెరిగిన ఉష్టోగ్రతలు, వాతావరణంలో మార్పులు కారణంగా ఊహిస్తున్నారు. వాస్తవానికి, ఏసీ పని తీరుపైన మరియు సర్వీస్ పైన అవగాహన లేకపోవడం కూడా కారణాలు కావచ్చని ఊహించడం లేదు. అందుకే, ఈరోజు ఏసీ పేలడానికి గల కారణాలు మరియు ఏసీ కాపాడుకోవడానికి యూజర్లు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరంగా చూద్దాం.

AC Blast: అసలు ఏసీ ఎందుకు పేలుతుంది?

పెరుగుతున్న ఉష్టోగ్రతల నుండి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఏసీ లను ఆశ్రయిస్తున్నారు. అందుకే, ఏసీ వినియోగం పెరిగిపోయింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగిన ఏసీ బ్లాస్ట్ తర్వాత బయటకు వచ్చిన విషయాల ద్వారా కొన్ని విషయాల పైన దృష్టి సారించాల్సిన ఆలోచన యూజర్లకు కల్పించాల్సి వస్తోంది. ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఇంట్లో మార్చిన ఏసీ యొక్క కంప్రెసర్ పేలడమే అని తేల్చి చెప్పారు. నోయిడా ఫైర్ బ్రిగేడ్ ఆఫీసర్, ప్రదీప్ కుమార్ ఈ విషయాన్ని తెలియ పరిచారు.

ఇది అర్ధం చేసుకోవాలంటే ఏసీ ఎలా పని చేస్తుంది మరియు ఏసీల పైన ప్రభావం చూపే విషయాలు తెలుసుకోవాలి. ఏసీ ఇంటిని చల్లబరచడానికి వేడి గాలిని పీల్చుకొని ఏసీ ఇండోర్ యూనిట్ లో ఉండే కాయిల్స్ ద్వారా చల్లబరిచి, తిరిగి చల్లని గాలిని గదిలోకి విసురుతుంది. ఇక్కడ మీడియంగా ఉండేది కాయిల్స్ నుంచి సరఫరా అయ్యే రిఫ్రిజెరెంట్ గ్యాస్. ఈ గ్యాస్ కాయిల్స్ ద్వారా ఇండోర్ యూనిట్ మరియు అవుట్ డోర్ యూనిట్ లో ఉండే కంప్రషర్ ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే, ఈ పనిని నిర్వహించేది అవుట్ డోర్ యూనిట్ లో ఉండే కంప్రెసర్ అని మీకు అర్ధం అయ్యే ఉంటుంది.

Also Read: Jio offer: రూ. 895 కే 11 నెలల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ అందుకోండి.!

ఈ కంప్రెసర్ ఒక నిర్దిష్టమైన వేడి వరకూ తట్టుకుంటుంది. ఒకవేళ కంప్రెసర్ అధిక వేడిమి మరియు ఒత్తిడికి లోనైతే పేలిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి కారణమయ్యే అంశాలను పరిశీలిస్తే, వాతావరణం వేడెక్కడం, కంప్రెసర్ లో వుండే గ్యాస్ తగ్గిపోవడం, కాయిల్స్ ను తరచుగా శుభ్రం చేయకపోవడం మరియు ఏసీ కి రెస్ట్ ఇవ్వకుండా ఏకధాటిగా ఉపయోగించడం వంటి అంశాలు ఉంటాయి.

పైన తెలిపిన అన్ని కారణాలు ఏసీలో ఉండే కంప్రెషర్ పైన అధిక ప్రభావాన్ని చూపే అంశాలు. అందుకే, ఏసీ లను ఉపయోగించే యూజర్లు కొన్ని విషయాల పైన ద్రుష్టి సారించి తగిన జాగ్రతలు పాటిస్తే ఏసీలు ప్రమాదానికి గురికాకుండా కాపాడుకోవచ్చు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Ac blast
Ac Service

ఏసీ అవుట్ డోర్ యూనిట్ లను నేరుగా ఎండ తగిలేలా కాకుండా నీడలో మరియు గాలి తగిలేలా బిగించాలి. అలాగే, ఏసీ లను గంటల తరబడి ఏకధాటిగా వాడకుండా మధ్య మధ్యలో కొంత సమయం రెస్ట్ ఇస్తే, కంప్రెసర్ చల్లబడడానికి అవకాశం ఉంటుంది. కంప్రెసర్ ను చల్లబరిచే అవుట్ డోర్ యూనిట్ ఫ్యాన్ ను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ఏసీ ని రెగ్యులర్ గా సర్వీస్ చేయించాలి మరియు సర్వీస్ సమయంలో గ్యాస్ తగిన పరిమాణంలో ఉందో లేదో కూడా చెక్ చేయించుకోవాలి.

అంతేకాదు, స్ప్లిట్ ఏసీ లను కొనేముందు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కాపర్ (రాగి) కండెన్సర్ తో వచ్చే స్ప్లిట్ ఏసీ లను ఎంచుకోవాలి. ఎందుకంటే, కాపర్ (రాగి) త్వరగా వేడెక్కదు కానీ త్వరగా చల్లబడుతుంది. అందుకే, కాపర్ కాయిల్ ఉన్న ఏసీలు త్వరగా వేడెక్కే అవకాశం ఉండదు. చెప్పడానికి చిన్న చిన్న కారణాలే అయినా, ఒక చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే, తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo