కేవలం 6 వేలకే 150 ఇంచ్ స్క్రీన్ తో ఇంటిని సినిమా థియేటర్ చేసే ప్రొజెక్టర్ కావాలా.!

Updated on 04-Jun-2024
HIGHLIGHTS

కేవలం 6 వేలకే 150 ఇంచ్ స్క్రీన్ ప్రొజెక్టర్ ను అందుకోవచ్చు

10% వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

ఈ ప్రొజెక్టర్ FHD సపోర్ట్ తో వస్తుంది

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ వస్తువులు మరింత చవక ధరల్లో లభిస్తున్నాయి. ఇప్పటికే స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ ఫోన్ లు చాలా చవక ధరలకే వస్తున్న కోవకు వచ్చాయి. ఇప్పుడు పెద్ద స్క్రీన్ ను అందించే ప్రొజెక్టర్ లు కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాయి. ఎంతగా అంటే, కేవలం 6 వేలకే 150 ఇంచ్ స్క్రీన్ తో ఇంటిని సినిమా థియేటర్ చేసే ప్రొజెక్టర్ ను సైతం అందుకోవచ్చు. ఈరోజు అటువంటి బడ్జెట్ ప్రొజెక్టర్ డీల్ ను మీకోసం అందిస్తున్నాం.

ఏమిటా ప్రొజెక్టర్ ఆఫర్?

ప్రముఖ బ్రాండ్ Zebronics ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టిన Pixaplay 11 Portable LED Projector ఈరోజు చాలా చవక ధరకు లభిస్తోంది. 1080p (FHD) సపోర్ట్ కలిగిన ఈ ప్రొజెక్టర్ ఈరోజు అమెజాన్ నుండి 58% డిస్కౌంట్ తో కేవలం రూ. 5999 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. ఈ ప్రొజెక్టర్ ను HDFC Bank Debit EMI ఆఫర్ తో కొనేవారికి 10% వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

జీబ్రానిక్స్ పిక్సాప్లే 11 ప్రత్యేకతలు ఏమిటి?

జీబ్రానిక్స్ పిక్సాప్లే 11 ప్రొజెక్టర్ 1500 Lumens తో వస్తుంది. ఈ ప్రొజెక్టర్ FHD సపోర్ట్ తో వస్తుంది మరియు చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ 5V అడాప్టర్ మరియు పవర్ బ్యాంక్ తో కూడా పని చేస్తుంది. ఈ ప్రొజెక్టర్ 150 ఇంచ్ స్క్రీన్ వరకూ విస్తరిస్తుంది మరియు మీ వినియోగ అవసరాన్ని బట్టి దీన్ని ఉపయోగించవచ్చు.

best budget projector

ఇక ఈ ప్రొజెక్టర్ లో అందించిన కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇందులో HDMI, USB, mSD మరియు AV వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. అయితే, ఇది స్మార్ట్ ప్రొజెక్టర్ కాదు కాబట్టి, ఇందులో Wi-Fi మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ లు లేవని గమనించాలి.

Also Read: Amazon Offer: భారీ డిస్కౌంట్ తో రూ. 19,999 కే OnePlus Nord 3 5G ఫోన్ అందుకోండి.!

అయితే, AUX అవుట్ పుట్ సపోర్ట్ తో స్పీకర్ లేదా సౌండ్ బార్ లకు కనెక్ట్ చేసుకునే వీలుంది. ఈ ప్రొజెక్టర్ రిమోట్ తో పని పని చేస్తుంది. చాలా చవక ధరలో పెద్ద స్క్రీన్ అందించే ప్రొజెక్టర్ కావాలనుకుంటే ఈ ప్రొజెక్టర్ ఆఫర్ ను చూడవచ్చు.

Portronics Beem 440 Smart LED Projector

ఒకవేళ మీరు స్మార్ట్ ప్రొజెక్టర్ కోరుకుంటే మాత్రం Portronics Beem 440 ను పరిశీలించవచ్చు. ఈ లేటెస్ట్ ప్రొజెక్టర్ 1800 Lumens, బిల్ట్ ఇన్ స్ట్రీమింగ్ యాప్స్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ మరియు స్క్రీన్ మిర్రరింగ్ వంటి స్మార్ట్ ఫీచర్స్ తో వస్తుంది. ఈ ప్రొజెక్టర్ ఈరోజు అమెజాన్ నుండి 60% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 రూపాయల ధరలో లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :
Tags: tech news