Best 1.5 Ton AC Deals today today available
Best 1.5 Ton AC Deals: 2025 సమ్మర్ ను బీట్ చేయడానికి మీ ఇంటిని చల్లబరిచే కొత్త ఏసీ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే, ఒక లుక్కేయండి. బడ్జెట్ యూజర్ల కోసం లభిస్తున్న లేటెస్ట్ 1.5 టన్ ఏసి డీల్స్ గురించి ఈరోజు చర్చించనున్నాము. దేశంలో ఎండల తీవ్రత ఇప్పటికే పెరిగింది మరియు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ తీవ్రమైన వేడిమి నుంచి తప్పించుకోవడానికి ఒక మంచి ఏసీని కలిగి ఉండటం మంచి విషయంగా ఉంటుంది.
ఈరోజు రెండు బెస్ట్ 1.5 టన్ ఏసీ డీల్స్ లభిస్తున్నాయి. ఈ డీల్స్ ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్నాయి. ఇందులో, Godrej 2025 మోడల్ 1.5 టన్ ఏసీ కాగా రెండవది Voltas 2024 మోడల్ 1.5 టన్ ఏసీ. ఈ రెండు ఏసీ డీల్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
గోద్రెజ్ సరికొత్తగా 2025 విడుదల చేసిన ఈ 1.5 టన్ 5-In-1 స్ప్లిట్ ఏసీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 39% డిస్కౌంట్ తో రూ . 32,490 ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఏసీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఏసీని కేవలం రూ. 29,990 రూపాయల ఆఫర్ ధరకు ఫ్లిప్ కార్ట్ నుంచి పొందవచ్చు.
ఈ గోద్రెజ్ ఏసీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఏసీ ఆటో కూలింగ్ అడ్జెస్ట్మెంట్ చేసే I-sense టెక్నాలజీ, 5-in-one కన్వర్టబుల్ కూలింగ్, R-32 గ్యాస్, 100% కాపర్ కండెన్సర్ మరియు యాంటీ డస్ట్ ఫిల్టర్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ గోద్రెజ్ ఏసి ప్రోడక్ట్ పై 5 సంవత్సరాల వారంటీ మరియు కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది.
Also Read: ఆన్లైన్ లో లీకైన iQOO Z10 స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్.. ఫోన్ ఎలా ఉందంటే.!
టాటా యొక్క ఈ వోల్టాస్ ఏసీ 3 స్టార్ బెనిఫిట్స్ తో వస్తుంది. ఈ ఏసీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 46% డిస్కౌంట్ తో రూ. 33,990 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ వోల్టాస్ ఏసీని HDFC క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 2,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ వోల్టాస్ ఏసి కేవలం రూ. 31,490 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
ఈ వోల్టాస్ ఏసి PCB పై 5 సంవత్సరాల వారంటీ మరియు కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది. ఈ ఏసీ R32 గ్యాస్, ఆటో క్లీన్ టెక్నాలజీ, యాంటీ డస్ట్ ఫిల్టర్స్ మరియు 100% కాపర్ కండెన్సర్ కాయిల్ ను కలిగి ఉంటుంది.