ఆన్లైన్ మోసాలు అంతకంతకు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశంలో రోజు ఏదో ఒక ఆన్లైన్ మోసం గురించి వార్తలు చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు 2024 దీపావళి పండుగ వస్తుందనగా ఇప్పుడు ఈ పండుగను కూడా స్కామర్లు ఒక మార్గంగా మార్చుకున్నారు. ఇప్పుడు కొత్తగా Diwali Gift పేరుతో కొత్త స్కామ్ కు తెర లేపారు. స్కామ్ వలలో చిక్కుకున్న ఒక బెంగళూరు టెక్కీ రూ. 4.5 లక్షలు పోగొట్టుకున్నారు. వాట్సాప్ లో వచ్చిన దివాళీ గిఫ్ట్ మెసేజ్ దెబ్బకి ఈ టెక్కీ అకౌంట్ ఖాళీ అయ్యింది.
ఈ స్కామ్ దివాళీ గిఫ్ట్ అని బాస్ పేరుతో మెసేజ్ ను అందుకున్న టెక్కీ ఆ మెసేజ్ కి రెస్పాండ్ అవ్వడమే శాపంగా మారింది. బెంగళూరు బేస్డ్ టెక్కీ వాట్సాప్ లో తన బాస్ పేరుతో పేటీఎం లో యాపిల్ స్టోర్ కార్డ్స్ ను దీపావళి గిఫ్ట్ కోసం అందుబాటులో ఉన్న విషయాన్ని చెక్ చేయవలసిందిగా మెసేజ్ అందుకున్నారు. బాస్ మీటింగ్ లో కారణంగా ఈ పని చేయాలని పెట్టినట్లు తెలిపారు.
ఈ మెసేజ్ అందుకున్న ఆ టెక్కీ తన బాస్ మెప్పు పొందడానికి తన సొంత డబ్బుతో కొనుగోలు చేసే ఆ కోడ్స్ ను చెప్పిన విధంగా షేర్ కూడా చేశారు. వీటి విలువ దాదాపు 4.5 లక్షలు ఉంటుంది. ఆ తర్వాత తెలిసింది తనకు నిలువునా మోసపోయానని. HR మేనేజర్ లేదా తన బాస్ నుంచి ఎలాంటి దివాళి గిఫ్ట్ వోచర్ కొనుగోలు రిక్వెస్ట్ రాలేదని. ఈ విషయం తెలుసుకున్న తర్వాత తాను స్కామ్ లో చిక్కుకొని మోసపోయిన విషయం అర్ధం అయ్యింది.
Also Read: రేపటితో ముగియనున్న Amazon Diwali Sale నుంచి భారీ స్మార్ట్ టీవీ డీల్ అందించిన అమెజాన్.!
విషయం అర్థమైన తర్వాత సదర్ టెక్కీ బెంగళూరు సైబర్ క్రైమ్ బ్రాంచ్ లో FIR నమోదు చేశారు. అయితే, యాపిల్ కస్టమర్ సపోర్ట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉండటం కారణంగా మిస్ యూజ్ అయిన కూపన్స్ పైన కంప్లైట్ మరియు సహాయం కోరడానికి పూర్తిగా 12 గంటలు వేచి ఉండవలసి వచ్చింది.
ఆన్లైన్ లో మోసాలు ఎక్కువ అవుతున్నాయి మరియు వీటి నుంచి తప్పుంచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా, గిఫ్ట్స్ పేరుతో వచ్చే ఫేక్ మెసేజ్ లను అవాయిడ్ చేయండి.